హుస్సాముద్దీన్‌కు రజత పతకం

28 Feb, 2017 00:38 IST|Sakshi
హుస్సాముద్దీన్‌కు రజత పతకం

న్యూఢిల్లీ: స్ట్రాన్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ రజత పతకంతో మెరిశాడు. బల్గేరియాలోని సోఫియా లో ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో అతను 56 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఉక్రెయిన్‌కు చెం దిన మికోలా బుత్సెంకోతో జరిగిన టైటిల్‌ బౌట్‌లో హుస్సాముద్దీన్‌ 2–3 పాయింట్ల తేడాతో ఓడిపో యాడు. ఈ టోర్నీలో భారత్‌ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... మరో ఇద్దరు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.

పురుషుల 49 కేజీ లైట్‌ ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీలో అమిత్‌ ఫంగల్, మహిళల 54 కేజీ కేటగిరీలో మీనా కుమారి మైస్నమ్‌ సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో తృప్తిపడ్డారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు మహిళలు సహా 15 మందితో కూడిన భారత బృందం పోటీపడగా మూడు పతకాలు లభించాయి.  31 దేశాల నుంచి 200 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు