ఆరేళ్లకు తగ్గిన బ్లాటర్, ప్లాటిని నిషేధం

26 Feb, 2016 00:10 IST|Sakshi

జ్యూరిచ్: ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, యూఈ ఎఫ్‌ఏ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై నిషేధం ఎనిమిదేళ్ల నుంచి ఆరేళ్లకు తగ్గింది. బుధవారం ఫిఫా అప్పీల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2011లో 2 మిలియన్ డాలర్లను ప్లాటినికి చెల్లించేం దుకు బ్లాటర్ అంగీకరించడం ఈ వివాదానికి కారణం. ఫిఫా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని భావించిన ప్లాటినికి ఈ నిషేధంతో దారులు మూసుకుపోయినట్టే.

శుక్రవారం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. నిషేధాలను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్)కు వెళతామని ఇరువురు తెలిపారు. అలాగే అధ్యక్ష ఓటింగ్‌కు పారదర్శక బూత్‌లను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థి ప్రిన్స్ అలీ విజ్ఞప్తిని సీఏఎస్ తోసిపుచ్చింది.

మరిన్ని వార్తలు