'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం'

2 Jan, 2015 22:29 IST|Sakshi
'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం'

సిడ్నీ: మైదానంలో విరాట్ కోహ్లి దూకుడును వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్ సమర్థించాడు. కోహ్లి తన సహజసిద్ధ ప్రవర్తనను మార్చకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై నోటికి పనిచెప్పడం భారత ఆటగాళ్లు పెద్దగా చేయరని, కానీ కోహ్లి ఈ విషయంలో ముందున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో కోహ్లిని అభిమానిస్తానని అన్నాడు.

దూకుడు స్వభావంతో అసలైన ఆటతీరు బయటకు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే దుండుకు ప్రవర్తనతో ఎవరినీ బాధ పెట్టకూడదని వీవీయన్ రిచర్డ్స్ సలహాయిచ్చాడు.

మరిన్ని వార్తలు