లోనావాలా, ఖండాల పర్యాటక ప్రాంతాల్లో పోలీసు భద్రత

5 Jul, 2015 03:12 IST|Sakshi

హెచ్చరిక బోర్డులున్నా ప్రమాదాలు  జరుగుతున్నాయంటున్న పోలీసులు
అత్యుత్సాహంతో పర్యాటకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్య

 
 పింప్రి : లోనావాలా, ఖండాలా పరిసర ప్రాంతాలలో పర్యాటకుల భద్రతకోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అధిక సంఖ్యలో బలగాలు మోహరించారు. వర్షాకాలంలో లోనావాలా, ఖండాలా ప్రాంతాలకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ రెండు రోజులపాటు పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి  వై.ఎస్.పాటిల్ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికల సూచన బోర్డులు ఉన్నప్పటికి కొంత మంది పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.

లోనావాలాలోని టైగర్ పాయింట్ నుంచి బయలు దేరి పిరమిడ్ ఆకారంలోని శిఖరాన్ని చూడటానికి వెళ్లి లోయలో పడి మరిణించిన ఘటనలు గతంలో అనేకం జరిగాయని చెప్పారు. రేలింగ్ ఎక్కేముందు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజామాచి, లోహ్‌గఢ్ కోట పరిసరాలు, కర్జత్ దర్శనం అత్యంత ప్రమాదకర పర్యాటక స్థలాలని, పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించాలి గానీ అత్యుత్సాహం ప్రదర్శించకూడదని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు