శశికళకు డెంగీ జ్వరం

2 Apr, 2018 03:43 IST|Sakshi
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ

సాక్షి,చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. పెరోల్‌పై బయటకు వచ్చిన ఆమె డెంగీతోనే పరప్పన అగ్రహార జైలుకు తిరిగి వెళ్లినట్లు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత, ఆమె సోదరి వనితామణి కుమారుడు దినకరన్‌ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భర్త నటరాజన్‌ మృతితో శశికళ కుంగిపోయా రని తెలిపారు. అందుకే ఆమెకు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయించామన్నారు. వైద్యపరీక్షల్లో ఆమెకు డెంగీ జ్వరం ఉన్నట్లు తేలిందన్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించి వైద్యులు ఇచ్చిన సర్టిఫి కెట్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించామన్నారు. ఆమెకు వైద్య పరీక్షలతోపాటు మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా