ఎల్లుండి ఆర్టీసీ కార్మికులతో సీఎం భేటీ

29 Nov, 2019 14:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో మలుపుల తర్వాత టీఎస్‌ ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడగా కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ఆదివారం (డిసెంబర్‌ 1) ప్రగతి భవన్‌లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, ఇందుకోసం వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులండాలన్నారు.

సమావేశాల్లో అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులు ప్రగతి భవన్‌కు చేరుకోవాలన్నారు. సమావేశానికి వచ్చే కార్మికులకు ప్రగతి భవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి.. అనంతరం వారితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి అజయ్‌ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు పాల్గొననున్నారు. 52 రోజుల సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. నేడు ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల్లో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ కార్మిక నేతలకు షాక్‌; రిలీఫ్‌ డ్యూటీ రద్దు

ఒక్క ఫోన్‌ కాల్‌.. నిమిషాలలో మీ వద్దకు..

మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌

కిడ్నీ.. కిలాడీలు!

అన్నం లేకుంట చేసిండ్రు..

హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు

రెండు గ్రామాల్లో దొంగల బీభత్సం  

కుళ్లిన మాంసం.. పాడైన ఆహారం

సిటీజనులు గజగజలాడుతున్నారు....

తాళం వేసి ఉంటే లూటీనే..! 

భవిష్యత్‌లో ఫ్లై ఓవర్లు ఇవే!

ప్రియాంక రెడ్డి : అవే చివరి విధులు..!

ఆ ఒక్కటీ అడక్కు!  

సాగర్‌ కాల్వలో విద్యార్థి గల్లంతు

ఆరు దాటితే ఆగమే !

నేటి ముఖ్యాంశాలు..

విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు

జెండాను మోస్తున్నాం... అజెండా నిర్ణయిస్తాం

యువ పారిశ్రామికవేత్తలకు అండ: కేటీఆర్‌ 

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

ఫస్ట్‌ అవర్‌లో హ్యాపీగా జాయిన్‌ కండి...

నమ్మించి చంపేశారు!

టీఎస్‌ఆర్టీసీ వచ్చాక రెండోసారి ఛార్జీల పెంపు

సంక్షేమం దిశగా ‘సాగు’తున్నాం

ప్రేమ.. అత్యాచారం.. హత్య

చనిపోతే అరిష్టమని..

ఐఐటీలో సోలార్‌ ఆటో టెస్టు డ్రైవ్‌

ఇక ఒత్తిడి లేని చదువులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు అలీ దంపతులకు సన్మానం

సినిమా ట్రైనింగ్‌ క్లిప్స్‌ విడుదల చేసిన వర్మ

‘ఫెవిక్విక్‌’ బామ్మ కన్నుమూత

ఆస్పత్రి నుంచి కమల్‌ హాసన్‌ డిశ్చార్జ్‌

పట్టువదలని విక్రమార్కుడు

ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి: నిత్యామీనన్‌