జైలు నుంచే బిజినెస్ చేస్తున్నాడు!

22 Oct, 2016 13:43 IST|Sakshi
జైలు నుంచే బిజినెస్ చేస్తున్నాడు!
తిరువనంతపురం : కేరళ బీడీ టైకూన్గా పేరొందిన మహ్మద్ నిషామ్, సెంట్రల్ జైలు నుంచే బిజినెస్లు చేస్తున్నాడట. ఈ ఫిర్యాదును ఎవరో దాఖలు చేయలేదు. స్వయానా తన తరుఫున బందువులే శుక్రవారం ఈ ఆరోపణలు చేశారు.  తన అపార్ట్ మెంట్ సెక్యురిటీ గార్డుని హత్య చేసిన కేసులో జీవిత ఖైదుగా శిక్షపడిన నిషామ్కు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ అందుతుందని, రెండు సెల్ ఫోన్లను అతను వాడుకునేందుకు అనుమతి ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు మొబైల్ నెంబర్లకు రీచార్జ్ కూడా అక్కడి ఆఫీసు స్టాఫే చేయిస్తున్నారని ఆరోపణ చేశారు. ఈ ఫోన్లను వాడుతూ విదేశాల్లో బిజినెస్ డీల్స్ను చేస్తున్నాడని తెలిపారు. విచారణ కోసం అతని బెంగళూరుకు బస్సులో తరలిస్తున్న క్రమంలో నిషామ్ తన మేనేజర్ను, స్నేహితుడిని కలవడానికి పోలీసు ఎస్కార్ట్ టమ్ సహకరించిందని  ఫిర్యాదులో ఆరోపించారు.   
 
నిషామ్ గతేడాది జనవరిలో తన అపార్ట్మెంట్ సెక్యురిటీ గార్డు చంద్రబోస్ మెయిన్ గేట్లు తెరవడానికి ఆలస్యం చేశాడని విపరీతంగా గొడవపడ్డాడు. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్న నిషామ్‌.. గార్డు మీద ఆగ్రహానికి గురై.. తన కారుతో అతి దారుణంగా బోస్ ను ఢీకొట్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బోస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసులో నిషామ్ను దోషిగా ప్రకటిస్తూ, జీవితఖైదుగా శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తిరువనంతపురంకు చెందిన నిషామ్ కోటీశ్వరుడు. ప్రస్తుతం నిషామ్ కాన్నూర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ఇతనిపై కనీసం 10 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించామని కన్నూర్ జిల్లా పోలీసు చీఫ్ సంజయ్ కుమార్ గురుదిన్ తెలిపారు. పోలీసు ఎస్కార్ట్ టీమ్పై వస్తున్న ఆరోపణలపై కూడా ఎంక్వయిరీకి ఆదేశించామని, ఒకవేళ తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
>
మరిన్ని వార్తలు