ఎనర్జీ, మెటల్‌  డౌన్‌,  మార్కెట్లు ఢమాల్‌ 

17 Mar, 2021 15:41 IST|Sakshi

50 వేల దిగువకు సెన్సె‍క్స్‌ 

15వేల దిగువకు నిఫ్టీ

మెటల్‌, ఎనర్జీ షేర్లలో నష్టాలు

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు  ఆ తరువాత స్వల్పంగా పుంజుకున్నా,  అక‍్కడ నిలదొక్కుకోలేకపోయాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో  కీలకమద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి.  సెన్సెక్స్‌  50 వేల స్థాయి దిగువకు, నిఫ్టీ 15వేల దిగువన ముగియడం గమనార్హం.

మెటల్‌,ఎనర్జీ ఇలా  దాదాపు అన్ని రంగాల షేర్లలోనే అమ్మకాలు వెల్లువెత్తాయి.   ప్రధానగా రిలయన్స్,  ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ ,భారతి ఎయిర్‌టెల్ వంటి హెవీవెయిట్స్‌లో నష్టాల కారణంగా మధ్యాహ్నం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్‌సూచీలు  భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఎఫ్‌ఎంసీజీ,  ఐటి షేర్లులో కొనుగోళ్లు కనిపించాయి. ఒకదశలో 620పాయింట్లుపైగా పతనమైన సెన్సెక్స్‌ 562  పాయింట్లు క్షీణించి  49801 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు నష్టంతో 14721 వద్ద ముగిసాయి. బీపీసీఎల్ 5 శాతం, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ కూడా 1.6-2.4 శాతం  క్షీణించి టాప్‌  లూజర్లుగా ఉన్నాయి. మరోవైపు ఐటీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, యుపిఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఎం అండ్‌ ఎం లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు