Ford: ప్లీజ్‌ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!

10 Sep, 2021 13:22 IST|Sakshi

'Please don't leave': ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్‌ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో అనేక మంది ఎమోషనల్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఫోర్డ్‌ డోంట్‌ గో అంటూ సోషల్‌ మీడియాలో ఫోర్డ్‌తో తమకున్న ఎమోషనల్‌ బాండింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 9న ఫోర్డ్‌ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్‌ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండవుతోంది.

- మెయినుద్దీన్‌ షేక్‌ అనే వ్యక్తి స్పందిస్తూ ఫోర్డ్‌ అస్పైర్‌ కారు కొనుక్కోవడం తన లక్క్ష్యమని, దానికి సంబంధించిన డబ్బును కూడబెట్టానని, ఈ ఏడాది చివరికల్లా కొనుక్కుందామని ప్లాన్‌ చేశానని పేర్కొన్నాడు. ఫోర్డ్‌ తాజా నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని, ఫోర్డ్‌ ప్లీజ్‌ డోంట్‌ గో అంటూ కోరాడు

- భార్గవ్‌ పెదకొలిమి అనే ట్విట్టర్‌ యూజర్‌ స్పందిస్తూ... 12 ఏళ్ల నుంచి ఫోర్డ్‌ కారు కొనుక్కోవాలనేది తన కలని, ఇప్పుడు ఆ కల తీరే సమయం వచ్చినప్పుడే ఫోర్డ్‌ ఇండియాను వీడి వెళ్లిపోతుందని తెలిసి హార్ట్‌బ్రేక్‌ అయ్యిందటూ పేర్కొన్నాడు. క్వాలిటీ, కంఫర్ట్‌, పవర్‌ఫుల్‌ ఇంజన్‌ అందివ్వడంలో ఫోర్ట్‌ మేటి అని చెబతూ.. ఇండియాను వదిలి వెళ్లొద్దంటూ రిక్వెస్ట్‌ చేశాడు.
- నాకు ఆరేడేళ్ల వయసు నుంచి ఫోర్డ్‌ కారు సొంతం చేసుకోవాలనే కల ఉండేదని, ఇప్పుడు ఫోర్డ్‌ ఇండియాను వీడి వెలుతుందనే వార్తలతో నా కల చెదిరిపోయిందంటూ సిద్ధార్థ్‌ నౌతియాల్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు.

నాట్‌ లీవింగ్‌ ఇండియా
ఇండియాను వీడి పోతున్నట్టు ప్రకటించగానే నెటిజన్ల నుంచి వెల్లువెత్తున్న ఎమోషనల్‌ ట్వీట్స్‌కి ఫోర్డ్‌ ఇండియా స్పందించింది. ఇండియాను తాము వీడి వెళ్లడం లేదంటూ లైట్‌ బిజినెస్‌ మోడల్‌ని అప్లై చేయబోతున్నట్టు తెలుపుతోంది. దీని వల్ల లాంగ్‌ రన్‌లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇస్తోంది.  

మరిన్ని వార్తలు