గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్ 

24 Feb, 2021 16:08 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేనిది ప్రతి ఒక్కరికి పూటైనా గడవదు. మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ రోజుకి 3 నుంచి 5 గంటలు మొబైల్ మీద గడుపుతున్నారు. ఇన్ని గంటలు ఫోన్ చూడటం కొన్ని మానసిక సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే చాలా యాప్ కంపెనీలు యూజర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డార్క్ మోడ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తున్నాయి. దీని వల్ల క‌ళ్ల‌కు కాస్త శ్ర‌మ తగ్గుతుంది. అలాగే ఎక్కువ సేపు వాడే మొబైల్లో బ్యాటరీ కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ డార్క్ మోడ్ ఫీచ‌ర్ వల్ల ఎంతో కొంత ఆదా కానుంది. 

తాజాగా గూగుల్ కూడా త‌న మ్యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తోంది. ఇది దశల వారీగా అందరికి అందుబాటులో రానుంది. గూగుల్ మ్యాప్ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్‌లో ఆల్‌వేస్ ఇన్ డార్క్ థీమ్ సెల‌క్ట్ చేసుకుంటే మ్యాప్స్‌ను డార్క్ మోడ్‌లో చూడొచ్చు. ఈ ఫీచ‌ర్ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంద‌ని గూగుల్ పేర్కొంది. ఇది ఇష్టం లేనివాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణ థీమ్‌లోకి మార్చుకోవ‌చ్చు. అయితే డార్క్ మోడ్ వ‌ల్ల క‌ళ్ల‌పై ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు బ్యాట‌రీ కూడా సేవ్ అవుతుంది. గ‌తంలో చీక‌టి ప‌డుతుంటే నావేగేటింగ్ డార్క్ మోడ్‌లోకి, ఉద‌యం పూట మ‌ళ్లీ లైట్ మోడ్‌లోకి స్వయం చాలకంగా వ‌చ్చేది.

చదవండి:

క్వాల్‌కామ్‌తో ఎయిర్‌టెల్‌ జట్టు

భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్

మరిన్ని వార్తలు