టర్బో ప్రాసెసర్‌, భారీ కెమెరా, అతితక్కువ ధర: ‘వివో టీ1ఎక్స్‌’

20 Jul, 2022 12:57 IST|Sakshi

 ‍ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌తో  బేస్‌ మోడల్‌ ధర  రూ.10,999

సాక్షి, ముంబై: మొబైల్‌ మేకర్‌ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత  మార్కెట్లో లాంచ్‌ చేసింది. T-సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందించనుంది. వివో టీ1  ఎక్స్‌ పేరుతో, మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను  బుధవారం  తీసుకొచ్చింది.  వివో టీ1  ఎక్స్‌ బేసిక్‌ మోడల్‌ ధరను ధర రూ. 11,999గా  ఉంచింది.

వివో టీ1  ఎక్స్‌ ఫీచర్లు
6.58 అంగుళాల FHD+ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 12 OS
50MP డ్యూయల్ కెమెరాలు
8MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ ,18W ఫాస్ట్ ఛార్జింగ్  

ధరలు, లభ్యత
4 జీబీ ర్యామ్‌+ 64జీబీ స్టోరేజ్‌  రూ. 11,999, 
4 జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌  రూ. 10,999 
6 జీబీ ర్యామ్‌ + 128జీబీ  స్టోరేజ్‌రూ. 14,999

గ్రావిటీ బ్లాక్ , స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్  వివో ఇ-స్టోర్ ద్వారా జూలై 27వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తుంది.

మరిన్ని వార్తలు