డబ్బులిస్తావా.. మ్యారేజ్‌ హాల్‌ తగలబెట్టనా?

12 Sep, 2020 15:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్తను బెదిరించి, లక్షల్లో డబ్బు వసూలకు ప్రయత్నించిన కేసులో ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతోన్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితుడు 2015లో తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే కళ్యాణ మండపాన్ని పేల్చేస్తానని ఓ వ్యాపారవేత్తను బెదిరించాడు. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని రామ్‌పూర్ జిల్లాకు చెందిన విష్ణు (36) ఢిల్లీ వ్యాపారవేత్త ప్రణబ్ సేథ్ నుంచి డబ్బులు వసూలుచేయడానికి పథకం వేశాడు. తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే రూప్ నగర్‌లో ఉన్న ప్రణబ్ కళ్యాణ మండపాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టులో నేరం రుజువయ్యింది. దీనిపై 2015లో తీర్పు వెలువరించిన ఢిల్లీ కోర్టు విష్ణుని దోషిగా నిర్ధారించింది. (చదవండి: కారుతో గుద్దింది గాక పోలీసులకే కట్టుకథ)

దాంతో అప్పటి నుంచి విష్ణు పరారీలో ఉన్నాడు. తాజాగా, నిందితుడిని రామ్‌పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నేరస్థుడు తన స్వగ్రామంలో ఉన్నట్టు గుర్తించామని, సెప్టెంబరు 4న అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు విష్ణుపై రాజౌరీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసులు నమోదుచేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు