లోన్‌ యాప్‌ వేధింపులు: మరో వ్యక్తి బలి

2 Jan, 2021 16:18 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. రుణాల పేరుతో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక తెలంగాణలో మరో వ్యక్తి బలైయ్యాడు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలోని తన నివాసంలో చంద్రమోహన్‌ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. (చదవండి: సూసైడ్‌ నోట్‌ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య)

లోన్‌ కట్టాలంటూ యాప్‌ నిర్వాహకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో.. తన ఫోన్‌ కాంటాక్ట్స్‌లో ఉన్న నంబర్లకూ మెసేజ్‌లు పంపడంతో మనస్థాపం చెందిన చంద్రమోహన్‌.. తన నివాసంలోనే ఉరేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సాక్షి స్టింగ్‌‌ ఆపరేషన్‌: కరోనా టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు)

మరిన్ని వార్తలు