యూట్యూబ్‌లో దూసుకుపోతున్న అజయ్‌.. అతడి ఖాతాలో 30.2 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్స్‌!

24 Dec, 2021 11:05 IST|Sakshi

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు....పాట గురించి గుజరాతీ కుర్రాడు అజయ్‌కి తెలియకపోవచ్చు. కాని అతడికి బాగా తెలుసు... ప్రతి నిమిషం ఇష్టమైన పనిపై దృష్టి పెడితే సక్సెస్‌ను కరెక్ట్‌గా ఊహించవచ్చు అని. అందుకే అజయ్‌ అలియాస్‌ అజ్జూభాయ్‌ విజేత అయ్యాడు.  ‘టాప్‌ 10 ఇండియన్‌ యూట్యూబ్‌ క్రియేటర్స్‌–2021’ గేమర్స్‌ జాబితాలో టాప్‌లో ఉన్నాడు... 

అజ్జూభాయ్‌గా ప్రసిద్ధుడైన అహ్మదాబాద్‌కు చెందిన అజయ్‌ ఇంటర్మీడియట్‌ తరువాత ‘ఇక చదువుకోవడం నా వల్ల కాదు’ అనుకున్నాడు. అలా అని ఖాళీగా తింటూ కూర్చోలేదు. బలాదూర్‌గా తిరగలేదు. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాలంటే అతడికి చాలా ఇష్టం. ఆన్‌లైన్‌ వేదికగా సొంతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన అజయ్‌ బాల్యం ‘స్కూల్‌ టు హోమ్‌....హోమ్‌ టు స్కూల్‌’ అన్నట్లుగా ఉండేది. అలాంటి అజయ్‌ చదువు మధ్యలోనే మానేయడం తల్లిదండ్రులకు నచ్చిందో లేదో కానీ వారు పెద్దగా ఏమీ అనలేదు. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ‘గ్రోత్‌ హ్యాకర్‌’గా పనిచేశాడు అజయ్‌.

తనకు గేమింగ్‌ అంటే చా...లా ఇష్టం. అయితే తన ఫ్రెండ్స్, పరిచయస్తులలో గేమ్స్‌ గురించి పెద్దగా తెలిసినవాళ్లు, బాగా ఇష్టపడేవాళ్లు  లేరు. గేమర్స్‌ తమదైన గేమింగ్‌ కమ్యూనిటీని ఎలా క్రియేట్‌ చేసుకుంటారు? అనే సందేహం అతనికి ఎప్పుడూ వచ్చేది. ఇక తానే సొంతంగా ఆన్‌లైన్‌లో తనలాంటి ఆసక్తి ఉన్నవారిని పరిచయం చేసుకొని గేమ్స్‌ ఆడేవాడు. మొదటిసారి యూట్యూబ్‌లో ‘ఫ్రీ ఫైర్‌’ గేమ్స్‌ చూసినప్పుడు బాగా ఆకర్షితుడయ్యాడు. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాడు.

 ఒకరోజు తన సోదరుడితో అన్నాడు...
‘యూట్యూబ్‌ గేమింగ్‌ చానల్‌ మొదలుపెడదామనుకుంటున్నాను. ఎలా ఉంటుంది?’
‘నీకంత సీన్‌ లేదు’ అని ఆ సోదరుడు వెక్కిరించి ఉంటే ఎలా ఉండేదోగానీ ‘బాగుంటుంది. నువ్వు బ్రహ్మాండంగా చేయగలవు’ అని ధైర్యం ఇచ్చాడు. అలా మన అజయ్‌ ‘టోటల్‌ గేమింగ్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టాడు. ఇది సూపర్‌ హిట్టు. దీనిలో గేమింగ్‌ కంటెంట్‌ ఎప్పటికప్పుడూ అప్‌లోడ్‌ చేస్తుంటారు. ‘టీజీ టోర్నమెంట్స్‌’ అనే రెండో చానల్‌ మొదలుపెట్టాడు. అది కూడా సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. ఇందులో ఫ్రీ ఫైర్‌ టోర్నమెంట్స్‌ నిర్వహిస్తుంటారు.
వెరైటీస్‌ ఆఫ్‌ గేమింగ్, ఎంటర్‌టైనింగ్, మోటివేషనల్‌....మొదలైనవాటితో కంటెంట్‌ క్రియేటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు అజ్జూభాయ్‌.

అతడి ఖాతాలో 30.2 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్స్‌!!
మన దేశంలో ‘లీడింగ్‌ గేమర్‌’గా పేరు తెచ్చుకున్న అజ్జూభాయ్‌ విజయరహస్యం ఏమిటి?
అతని మాటల్లోనే చెప్పాలంటే... ‘క్లీన్‌ కంటెంట్‌’ స్మార్ట్‌టీవిలు మొదలైన తరువాత కుటుంబంతో కలిసి గేమ్స్‌ ఆడే కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్లీన్‌ కంటెంట్‌ ఉండాలని, అభ్యంతరకరం కాని భాష ఉండాలనేది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతడిని విజేతను చేసింది.


కర్వ్‌డ్‌ హెచ్‌డీ టచ్‌స్క్రీన్‌ ∙40 ప్లస్‌ డైలీ లైవ్‌క్లాసెస్‌. పాప్‌లర్‌ మ్యూజిక్‌. బ్యాలెన్స్‌డ్‌ డిజైన్‌. మాగ్నెటిక్‌ రెసిస్టెన్స్‌. డ్యుయల్‌ బాటిల్‌ హోల్డర్స్‌. బ్లూటూత్‌ రెసిస్టెంట్‌ కంట్రోల్‌.సూపర్‌ఫాస్ట్‌ స్ట్రీమింగ్‌  స్క్రాచ్‌.  రెసిస్టెన్స్‌ బరువు: 56కిలోలు

చదవండి: ఫిమేల్‌ ఆర్‌జే: అహో... అంబాలా జైలు రేడియో!

  

మరిన్ని వార్తలు