Kiara Advani: కత్రినా బాటలో మరో హీరోయిన్‌.. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌

24 Dec, 2021 11:05 IST|Sakshi

Kiara Advani And Sidharth Malhotra Relationship: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం,ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ప్రేమజంట తమ రిలేషన్‌ షిప్‌ను బయటపెట్టాలని చూస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. కాగా కాగా సిద్దార్థ్‌, కియారాలు తొలిసారి జంటగా‘షెర్షా’మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్‌ టాక్‌. 

మరిన్ని వార్తలు