అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం

8 Mar, 2021 12:42 IST|Sakshi

మన్సుఖ్ హిరెన్‌ అనుమానాస్పద మరణం

రంగంలోకి ఏటీఎస్‌ , హత్య కేసు నమోదు

సాక్షి, ముంబై: ఆసియా కుబేరుడు, పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం (ఫిబ్రవరి 26న) నవ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా అనుమానాస్పదంగా మరణించిన స్కార్పియో ఓనర్‌ మన్సుఖ్ హిరెన్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. నేరపూరిత కుట్ర, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై మహారాష్ట్ర  ఏటీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హిరేన్‌  భార్య  విమల ఫిర్యాదు మేరకు మరణించిన రెండు రోజుల తరువాత, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం ఆదివారం హత్య కేసు నమోదు చేసింది. అలాగే రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం హిరెన్ మరణానికి సంబంధించిన కేసునుఏటిఎస్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత పత్రాలన్నీ ఏటీఎస్‌ విభాగం స్వాధీనం చేసుకుని  అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి విచారిస్తున్నారు. ఈ కేసులో హిరేన్  ఒక్కడే సాక్షి అతడిని కూడా కోల్పోయామని అని దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. (అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు)

రిలయన్స్‌ అధినేత అంబానీ నివాసానికి సమీపంలో గుర్తించిన పేలుడు పదార్థాలున్న వాహనం యజమానిగా భావిస్తున్న మన్సుఖ్  హిరేన్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన  మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎన్‌ఐఏ దర్యాప్తును డిమాండ్‌  చేశారు. మరోవైపు పోలీసు అధికారులు తనను వేధిస్తున్నారని, ఈ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా థానే, ముంబయి పోలీస్ కమిషనర్లకు హిరేన్ మార్చి 2న లేఖ రాశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో  మార్చి 5న హిరేన్‌ అనుమానాస్పదంగా శవమై తేలడం సంచలనం రేపుతోంది.  (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు)


మన్సుఖ్ హిరెన్(ఫైల్‌ ఫోటో)

కాగా కుటుంబ సభ్యులు అందించిన సమాచారం వారం రోజుల క్రితమే తన వాహనం చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కందివాలి యూనిట్ క్రైమ్ బ్రాంచ్ అధికారిని కలవడానికి తాను థానేలోని ఘోడ్‌బందర్ ప్రాంతానికి వెళుతున్నానని హిరెన్ తన కొడుకుతో చెప్పి ఆటో రిక్షాలో బయలుదేరాడనీ, మార్చి 4, గురువారం రాత్రి 10.30 నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. శుక్రవారం ఉదయం వరకు హిరెన్ కనిపించకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు నౌపాడా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. గత వారం మధ్యాహ్నం థానేలోని  కొలనులో నోటిలో గుడ్డలు గుక్కిన రీతిలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే తన సోదరుడు అత్మహత్య చేసుకునేంత పిరికవాడుకాదనీ, అతనికి ఈత కూడా బాగా వచ్చని హిరెన్ సోదరుడు వినోద్ మీడియాకు తెలిపారు. ఇది కచ్చితంగా హత్యే అని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు తని శరీరంపై పలు గాయాలున్నాయని పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు