రాజీవ్‌ గాంధీ హత్య కేసు: వారిద్దరికి ఎక్కువ రోజులు పెరోల్‌ కుదరదు 

22 Jul, 2021 08:09 IST|Sakshi

వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్‌కు ఎక్కువ రోజులు పెరోల్‌ ఇచ్చేందుకు కుదరదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి తెలిపారు. బుధవారం వేలూరు పురుషులు, మహిళా సెంట్రల్‌ జైలులో ఆకస్మికంగా తనఖీలు చేసి ఖైదీలకు అవసరమైన వసతులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఖైదీలు తయారు చేస్తున్న చెప్పులు, షూలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మురుగన్, నళిని, శాంతన్, ఆరుగురు ఖైదీలతో నేరుగా వెళ్లి మాట్లాడానన్నారు. ఆ సమయంలో మురుగన్, నళిని ఆరు నెలలు పెరోల్‌ ఇప్పించాలని కోరారని, నెల రోజులు ఇచ్చేందుకు కుదురుతుందని చెప్పానన్నారు.

కోర్టు అనుమతి ఇస్తే తాము పెరోల్‌పై పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  ఖైదీలు తయారు చేస్తున్న షూ లు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. జైలులో నిషేధిత పదార్థాలు తీసుకెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గాంధీ, ఎమ్మెల్యే నందకుమార్, కార్తికేయన్, డీఆర్‌ఓ రామ్మూరి, సబ్‌ కలెక్టర్‌ విష్ణుప్రియ, జైళ్లశాఖ డీఐజీ జయభారతి, జైలు సూపరింటెండెంట్‌ రుక్మణి పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు