బుడగ లేకుండానే భారత్‌-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌

26 Apr, 2022 13:15 IST|Sakshi

IND VS SA T20 Series 2022: ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ సిరీస్‌ను బయో బబుల్‌ లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుడగ వాతావరణంలో ఆటగాళ్లు గత రెండేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్న కారణంగా ఈ నిబంధనలను ఎత్తి వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించారు. 

దేశవాళీ టోర్నీల్లో బయోబబుల్‌ను ఎత్తి వేస్తున్నట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ జూన్‌ 9 నుంచి ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ జూన్‌ 19 వరకు జరుగనుంది. ఢిల్లీ (జూన్‌ 9న తొలి టీ20), కటక్ (జూన్‌ 12న రెండో టీ20), వైజాగ్ (జూన్‌ 14న మూడో టీ20), రాజ్‌కోట్ ఝ(జూన్‌ 17న నాలుగో టీ20), బెంగళూరు (జూన్‌ 19న ఐదో టీ20) వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 
చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు