Jasprit Bumrah Wife Sanjana Ganesan: అదిరిపోయే ఫోటో షేర్‌ చేసిన బుమ్రా

20 Aug, 2021 17:11 IST|Sakshi

లండన్‌: ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజన గణేషన్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా తన భార్య సంజనా గణేశన్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఆ ఫోటోలో ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరోవైపు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన లార్డ్స్‌ టెస్టులో టీమిండియా విజయంలో  జస్ప్రీత్ బుమ్రా  కీలక పాత్ర పోషించాడు.  బుమ్రా  అటు బౌలింగ్ లోనూ... ఇటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. లార్డ్స్ లో జరిగిన ఈ రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంతితో మాత్రమే కాకుండా, మహమ్మద్ షమీతో కలిసి  రాణించిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ జోడీ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు.

చదవండి:T20 World Cup: అఫ్గాన్లు ప్రపంచకప్‌ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

A post shared by jasprit bumrah (@jaspritb1)

మరిన్ని వార్తలు