Sri Lanka 100th Test Win: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. భారత్‌, పాక్‌ల తర్వాత..!

29 Apr, 2023 08:06 IST|Sakshi

బౌలర్లు రమేశ్‌ మెండిస్‌ (5/64), ప్రభాత్‌ జయసూర్య (2/88), అసిథా ఫెర్నాండో (3/30) రాణించడంతో... ఐర్లాండ్‌తో గాలెలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్‌ 10 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో కరుణరత్నే కెప్టెన్సీలోని శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 1982లో టెస్ట్‌ హోదా పొందిన శ్రీలంక జట్టుకిది 100వ టెస్టు విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 54/2తో ఆట చివరిరోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ 77.3 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.  

భారత్‌, పాకిస్తాన్‌ల తర్వాత..
1982లో టెస్ట్‌ హోదా పొందిన శ్రీలంక.. ఐర్లాండ్‌పై రెండో టెస్ట్‌లో విజయంతో 100వ విక్టరీ సాధించింది. 311 టెస్ట్‌ల్లో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఆసియా దేశాల్లో భారత్‌ (569 టెస్ట్‌ల్లో 172 విజయాలు), పాక్‌ (451 టెస్ట్‌ల్లో 146 విజయాలు) ల తర్వాత శ్రీలంక ఈ అరుదైన జాబితాలో చేరింది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆసీస్‌.. 853 టెస్ట్‌ల్లో 405 విజయాలు సాధించింది. ఇక, అత్యధిక టెస్ట్‌లు ఆడిన రికార్డు ఇంగ్లండ్‌ (1060) పేరిట ఉంది.

మరిన్ని వార్తలు