Ultimate Kho Kho 2022: ఖో–ఖో లీగ్‌ విజేత ఒడిశా జగర్‌నాట్స్‌

5 Sep, 2022 04:41 IST|Sakshi

రన్నరప్‌ తెలుగు యోధాస్‌

పుణే: చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్‌ పైచేయి సాధించి అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్‌ 46–45తో ఒక్క పాయింట్‌ తేడాతో తెలుగు యోధాస్‌ జట్టును ఓడించింది. మ్యాచ్‌ ముగియడానికి 14 సెకన్లు ఉన్నాయనగా తెలుగు యోధాస్‌ 45–43తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ దశలో ఒడిశా ప్లేయర్‌ సూరజ్‌ అద్భుతమైన డైవ్‌ చేసి తెలుగు యోధాస్‌ ప్లేయర్‌ అవధూత్‌ పాటిల్‌ను అవుట్‌ చేసి మూడు పాయింట్లు స్కోరు చేశాడు.

దాంతో ఒడిశాకు చిరస్మరణీయ విజయం            సొంతమైంది. విజేతగా నిలిచిన ఒడిశా జట్టుకు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌ తెలుగు యోధాస్‌కు రూ. 50 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన గుజరాత్‌ జెయింట్స్‌కు రూ. 30 లక్షలు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు రామ్‌జీ కశ్యప్‌ (చెన్నై క్విక్‌గన్స్‌; రూ. 5 లక్షలు).. ‘బెస్ట్‌ అటాకర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు అభినందన్‌ పాటిల్‌ (గుజరాత్‌; రూ. 2 లక్షలు)... ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దీపక్‌ మాధవ్‌ (తెలుగు యోధాస్‌; రూ. 2 లక్షలు)... ‘యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు మదన్‌ (చెన్నై క్విక్‌గన్స్‌;
రూ. 2 లక్షలు) గెల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు