నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు

1 Sep, 2020 13:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గణేష్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు సాగుతున్నాయిని పేర్కొన్నారు. (నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు)

సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడు, మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం నిమజ్జనం అయిపోతుందని చెప్పారు.కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.ఈ రోజు అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవ సమితి నాయకులు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు