విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి

31 May, 2021 11:49 IST|Sakshi

గూడూరు: కాన్పు కోసం తల్లిగారింటికి వచ్చిన ఓ యువతి కరోనా బారిన పడి మృతిచెందింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దామరవంచలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ధరావత్‌ కొమ్మాలు, కాళీ దంపతులకు కూతురు సరిత (23)కు ఏడాది క్రితం ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.

మొదటి కాన్పు కోసం 20 రోజుల క్రితం సరితను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొమ్మాలు, కాళీ దంపతులకు కరోనా సోకింది.  కొడుకు దివాకర్‌తోపాటు కూతురు సరితకూ వైరస్‌ సోకింది. దీంతో వారంతా మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.  వైద్యుల సూచన మేరకు సరితను హన్మకొండ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ  ఓ పాపకు జన్మనిచ్చింది. 3 రోజుల క్రితం ఆ పాప, శనివారం సరిత మృతిచెందారు.
చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో..
 

మరిన్ని వార్తలు