Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: CM Jagan Last Punch At Pawan Pithapuram
పిఠాపురంతోనే సీఎం జగన్‌ లాస్ట్‌ పంచ్‌

గుంటూరు, సాక్షి: లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలోని డైలాగ్‌ ఇది. కానీ, రియల్‌లైఫ్‌లో పవన్‌కు ఆ పంచ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుచిచూపించన్నారా?. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా.. వైఎస్సార్‌సీపీ తరఫున చివరి ప్రచార సభను పిఠాపురంతోనే ముగించబోతున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతల పరుగులు.. మరోవైపు 59 నెలల పాలన, జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్‌లతో సాగిన సీఎం జగన్‌ ప్రసంగాలు.. అన్నీ.. అన్నీ.. ఇవాళ్టి సాయంత్రంతో బంద్‌ కానున్నాయి. ఆ వెంటనే ఏపీలో సైలెంట్‌ పీరియడ్‌ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్‌ దూకుడుతో.. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయన్నది వాస్తవం. ఇక సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన సీఎం జగన్‌.. ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. ‌కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్‌. ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన ఆయన.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి వెళ్లి.. అపూర్వ స్పందన దక్కించుకున్నారు. ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్‌.. ఏ రాజకీయ నాయకుడి నుంచైనా ఊహించగలమా?. ఈ చర్యతో తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు, పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మిన ప్రజలకు ఎప్పుడూ తాను దగ్గరేనని చాటి చెప్పారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరించారాయన.బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్రలేచి లక లక అంటూ ప్రజల రక్తం తాగుతుందిబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేజగన్‌కు ఓటేస్తే పథకాల కొసాగింపు.. ఇంటింటా అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడమేమంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు, బడుల మొదలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. డీబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరిస్తూ వచ్చారు. ‘‘మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని.. ఆలోచనతో ఓటు వేయాలి’’ అని కోరిన ఏకైక నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద జగన్‌కు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండబోదని, పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని చెరిపేసి.. పవిత్రంగా భావిస్తూ 99 శాతం హామీల్ని అమలు చేయడం, ఇప్పుడూ ఆ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించడమని అడగడం.. అదే మేనిఫెస్టోతో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది పూస గుచ్చినట్లు వివరించారాయన. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని కోరారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా.. తగ్గేదేలే అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన.విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్‌.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా.. కూటమి పార్టీల్లోని కీలక నేతల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం గమనార్హం. అదే సమయంలో ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్‌ చివరి మూడు ప్రచార సభలపై ఆసక్తి నెలకొంది. తొలుత చిలకలూరిపేట, కైకలూరు, ఆపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఆ ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్‌ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Chandrababu and Pawan Kalyan in extreme frustration
తారస్థాయికి చేరిన టీడీపీ అరాచకాలు

సాక్షి, అమరావతి: ఇదిగో.. ఓటమి.. కళ్ల ముందు కదలాడుతోంది.. పోలింగ్‌ రోజున ప్రజలు వరుసగా వచ్చి, జన నేత, సంక్షేమ సారథి సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తున్నట్టే కనిపిస్తోంది.. చంద్రబాబు కళ్ల ముందు కూటమి ఘోర ఓటమి కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు వణుకు ఎక్కువైంది. మరో 48 గంటల్లో ఎన్నికల పోలింగ్‌.. చంద్రబాబు, ఆయన కూటమికి మరోసారి కళ్ల ముందు ఘోర పరాజయం ఖాయమైంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు మనమేం చెప్పాలీ అని అంటే.. చెప్పుకొనే పనులేమీ చేయలేదు. చేసినవన్నీ మోసాలు, మాయలే. పోనీ పవన్‌.. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించడం ఒక్కటే ఉంది. మూడు జెండాలు జతకట్టినా, మరో మూడు జెండాల సహాయం తీసుకుంటున్నా.. కోట్ల నోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. మందు మంచి నీళ్లలా పోస్తున్నా.. 2019 ఎన్నికల కంటే ఘోర ఓటమే కళ్ల ముందు కనిపిస్తోంది. కించిత్తు ఆశ లేదు. పిచ్చెక్కిపోయింది.. పచ్చ ద్వయం చంద్రబాబు, పవన్‌కి ఫ్ర్రస్టేషన్‌ పీక్స్‌కి చేరింది. ఇద్దరూ నోటికి పని చెప్పారు. దుష్ఫ్రచారం, దూషణలు, బూతులు, దాడులు, ఎన్నికల అక్రమాలతో చెలరేగిపోతున్నారు. సీఎం జగన్‌ పైన, ఆయన ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు .నాలుక ఎటు తిరిగితే అది మాట్లాడేస్తున్నారు. బూతులూ వచ్చేస్తున్నాయి. చంద్రబాబయితే చంపుతామనీ అంటున్నారు. దు్రష్పచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉనికిని చాటుకోవాలన్న దింపుడు కళ్లం ఆశతో మైకు ముందుకొస్తున్నారు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించి, భద్రతనిచ్చే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పైన విష ప్రచారం ప్రారంభించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నీతి ఆయోగ్‌ రూపొందించిన ఈ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై యథేచ్ఛగా దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలనూ అడ్డుకొంటున్నారు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో నిధులు జమ కాకుండా అడ్డుపడ్డారు. సిగ్గు విడిచిన చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు స్థాయిని మరిచిపోయారు. సిగ్గెగ్గులు గాలికి వదిలేశారు. అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు.. అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ అరుస్తున్నారు. రాళ్లతో కొట్టండంటున్నారు. లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకొనే స్వయంప్రకటిత మేధావి పవన్‌ కళ్యాణ్‌ కూడా వైఎస్సార్‌సీపీ నేతలను తరిమితరిమి కొట్టండి అంటూ జనసేన–టీడీపీ రౌడీలను రెచ్చగొడుతున్నారు. వీరి వీరంగంతో టీడీపీ, జనసేన గూండాలు రెచ్చిల్పింపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. సీఎం జగన్‌ను కొట్టండంటూ చంద్రబాబు రెచ్చగొట్టిన తర్వాతే జగన్‌పై విజయవాడలో హత్యాయత్నం జరిగింది.గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ప్రచారానికి వచ్చిన బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై టీడీపీ–జనసేన మూక రాళ్ల దాడికి తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి, ఏడు హత్య కేసుల్లో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారు. నంద్యాల జిల్లా బనగానిపల్లెలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి గూండాలతో దాడులు చేయించారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో ప్రచారం ముగించుకుని భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ నేత, జెడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు తన అనుచరులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇవే కాదు.. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలుస్తామన్న మహిళలు, వృద్ధులు, యువతపైనా దాషీ్టకాలకు దిగుతున్నారు. విధ్వంసం, భయోత్పాతం సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్న కుతంత్రంతో చంద్రబాబు, పవన్‌ ముందుకెళ్తున్నారు. పట్టుబడుతున్న రూ.కోట్ల కట్టలు, మద్యం కేసులన్నీ కూటమివే.. ఓ వైపు విధ్వంసం సృష్టిస్తున్న చంద్రబాబు–పవన్‌ కళ్యాణ్‌.. మరో వైపు ఎన్నికల అక్రమాలకూ తెగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నోట్ల కట్టలు, మద్యం యథేచ్ఛగా పంచుతున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనాన్ని దోచేసి నింపుకొన్న నల్ల ఖజానాను తెరిచి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వందల కోట్లు రాష్ట్రంలో దించారు.ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారు. కర్ణాటక, గోవా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మద్యాన్ని రాష్ట్రంలోకి అక్రమంగా తరలించి, వీధి వీధిలో సీసాలు పంచుతున్నారు. ఎన్నికల అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న కోట్లాది రూపాయల నోట్ల కట్టలు, కేసులకు కేసుల మద్యం అంతా కూటమిదే కావడం గమనార్హం.

AP Elections 2024: May 11th Politics Latest News Updates Telugu
May 11th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..

Sajjala Ramakrishna Reddy comments over Chandrababu
‘ల్యాండ్‌ టైట్లింగ్‌’పై దుర్మార్గ రాజకీయం

సాక్షి, అమరావతి: కూటమి కట్టినా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు­పై చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో చంద్రబాబు చెప్పించగలరా అని నిలదీశారు. కుట్ర­పూరితంగా చట్టంపై దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. నీతిఆయోగ్‌ ప్రతిపాదనతో కేంద్రం తెచ్చిన ఈ చట్టం 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలవుతోందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ప్రజల భూములను ఎవరైనా దోచేశారా అని ప్రశ్నించారు. పత్రికల్లో అసత్య ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రమాదకరమైతే టీడీపీ శాసనసభల్లో ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు చీడపురుగు..ఉగ్రవాది కంటే ఘోరంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై చంద్రబాబు విష ప్రచారానికి ఒడిగట్టారు. ఎన్నికలకు ముందే ఆయన ఎత్తిపోయారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో సీఎం జగన్‌ను రాక్షసుడిగా చిత్రీకరిస్తున్నారు. 2019 జూలైలో శాసనసభలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలిపింది. ఆ రోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసన మండలిలో స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేశ్‌ కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ‘ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లు’ అమల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కూలంకషంగా వివరించారు (ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఆ రోజు మద్దతు తెలిపిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. రద్దు చేస్తానంటే కూటమి ఆమోదం ఉండాలి కదా? అది కూడా మోదీ, అమిత్‌షాతో చెప్పించకుండా ఉత్తుత్తి ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ పోలింగ్‌కు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ దుష్ప్రచారంపై ఎన్నికల సంఘం సీఐడీని కేసు నమోదు చేయమని చెప్పాక కూడా ఇలాంటి ప్రకటనలను ఈసీ ఎలా అనుమతించింది? ఎన్నికల్లో ఎప్పుడూ సక్రమ మార్గంలో గెలవని చంద్రబాబు లాంటి చీడ పురుగుకు సమాజంలో ఉండే అర్హత లేదు. ప్రజలు తనను నమ్మట్లేదని, సూపర్‌ సిక్స్‌ పని చేయట్లేదని ఆయన గ్రహించాడు. దీంతో ఓటమి భయంతో, దింపుడు కళ్లం ఆశతో దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు పింఛన్‌ అందకుండా అవ్వాతాతలను రోడ్లపైకి తీసుకొచ్చి బలితీసుకున్నాడు. మహిళలకు అందాల్సిన పథకాల నగదును జమ కాకుండా అడ్డుకున్నాడు. నేడు భూములు లాగేసుకుంటారంటూ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నాడు. రైతుల భూమికి ప్రభుత్వం గ్యారంటీ..భూ దోపిడీకి కేరాఫ్‌ చంద్రబాబు. వెబ్‌ల్యాండ్‌ పేరుతో ఆయన చేసిన భూదోపిడీ, తీసుకొచ్చిన భూ తగాదాలు అన్నీఇన్నీకావు. చుక్కల భూముల పేరుతో ఎందరో భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 22ఏలో పెట్టి.. డబ్బులు ఇస్తేవాటిని విడిపించే సంస్కృతిని తీసుకొచ్చారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక లక్షల ఎకరాల చుక్కలు, ఈనాం భూములకు విముక్తి కల్పించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దాదాపు 120 ఏళ్ల కింద బ్రిటీష్‌ వాళ్లు సర్వే చేశారు. సీఎం జగన్‌ వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టారు. యజమానుల ఆధ్వర్యంలో భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో జియో ట్యాగ్‌ చేస్తారు. తద్వారా తగాదాలు వచ్చే పరిస్థితి ఉండదు. డివిజన్, సబ్‌ డివిజన్లు కూడా సమగ్రంగా జరుగుతాయి. ఇవన్నీ పూర్తి చేశాక యజమానికి ప్రభుత్వం పూచీకత్తుతో, ఇన్సూరెన్స్‌ చేసి భూమికి భద్రత కల్పిస్తూ టైట్లింగ్‌ ఇస్తుంది. ఆ తర్వాత వేరొకరు ఆ భూమి తనదంటూ వచ్చినా టైట్లింగ్‌దారుడికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఎవరైనా ఆస్తిని కొని నిశ్చింతగా ఉండొచ్చు. సిగ్గు లేకుండా రాజకీయానికి వాడుకుంటున్నాడు..దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ–స్టాంపు విధా­నాన్ని కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఈ–స్టాంపులను ట్యాంపర్‌ చేయడానికి ఉండదు. దీన్ని చంద్రబాబు హయాంలోనే 2016–17లో తీసుకొచ్చారు. అప్పట్లో తెల్గీ స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం కూడా ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 8న నందమూరి బాలకృష్ణ విశాఖలో భూములు కొని 12న రిజి­స్ట్రేషన్‌ చేసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 8న ఈ–స్టాంపుతో పవన్‌ కళ్యాణ్‌ కూడా మంగళగిరిలో భూమిని కొనుగోలు చేసి అదే నెల 12న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.ఆ రిజిస్ట్రేషన్లకు విలువ లేకపోతే.. వారి­కిచ్చిన పత్రాలను చించేసి చంద్రబాబు తుడు­చుకోవచ్చు కదా. మీ బావమరిది బాలకృష్ణ, దత్తపు­త్రుడు పవన్‌ ఆస్తికి ఇప్పుడేమైనా అయ్యిందా? వాళ్ల స్థలాల్లో ఎవరైనా వెళ్లి జెండా పాతి నాది అంటే వదిలేస్తారా? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017–18లో ఈ–స్టాంప్‌ ద్వారా 77 వేలకు పైగా ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేస్తే అది 2023–24కు వచ్చేసరికి ఏకంగా 62.93 లక్షలకు పెరిగింది (2016–17లో ప్రారంభమై నాటి నుంచి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ ఆస్తులు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాల వరకు వీడియోలో చూపిస్తూ).ఈ విధానంలో లోపాలు లేకపోవడంతోనే చాలా మంది ఈ–స్టాంప్‌ల ద్వారా క్రయవి­క్రయాలు చేశారు. వాళ్లందరి భూములు సక్రమంగా ఉన్నాయి కదా! ఎలాగైనా అధికారంలోకి వచ్చేసి రామో­జీరావు ప్రజల సొమ్ముతో తన అక్రమ వ్యాపారాలు చేసుకోవాలని, బాబు అమరా­వతిలో రూ.వేల కోట్లు దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారు.

 Daily Horoscope: Rasi Phalalu On 11-05-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.చవితి తె.4.45 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి పంచమి, నక్షత్రం: మృగశిర ప.12.30 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.9.02 నుండి 10.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.15 వరకు,అమృతఘడియలు: రా.2.44 నుండి 4.19 వరకుసూర్యోదయం : 5.34సూర్యాస్తమయం : 6.18రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: పనులు చకచకా పూర్తి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.వృషభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.కర్కాటకం: పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారు.తుల: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృశ్చికం: ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలలో అవాంతరాలుల. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.ధనుస్సు: పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ధనప్రాప్తి. ధార్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది.మకరం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కుంభం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.మీనం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూముల వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

మహేంద్ర సింగ్‌ ధోని (PC: CSK X)
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్‌

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి మిస్టర్‌ కూల్‌ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్‌ టైటాన్స్‌- సీఎస్‌కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్‌ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్‌(103)‌, శుబ్‌మన్‌ గిల్‌(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్‌ కుప్పకూలగా.. మిడిలార్డర్‌ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్‌ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్‌ వికెట్స్‌ మిస్‌ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్‌గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తలా క్రేజ్‌, ఫ్యాన్స్‌ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024

Jio bundles 15 apps including Netflix with Rs 888 broadband plan
జియో గుడ్‌న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్‌

జియో ఫైబర్‌ తమ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో సహా 15 యాప్‌ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌.నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న జియోఫైబర్‌ (JioFiber) కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్‌ ప్లాన్‌తో కస్టమర్‌లకు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్‌ ఫైబర్‌ (AirFiber) కస్టమర్‌ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్‌ల సేవల్లో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ వంటివి ఉన్నాయి.

Nara Lokesh Tongue Slip Once Again
రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా

మంగళగిరి: గుంటూ­రు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్ని­కల ప్రచారంలో భాగంగా లోకేశ్‌ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.­300 పింఛన్‌ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్‌ నాలుక కరుచుకున్నారు.

sakshi special story about International Mothers Day
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా

ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్‌ డే’.» అమ్మ ఫోన్‌ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్‌ కాల్‌కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్‌లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్‌ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్‌ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్‌ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్‌ వాచ్‌ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్‌ రేడియో), మంచి ఫోన్‌ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్‌ సబ్‌స్క్రిప్షన్, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్‌ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్‌ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all