Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jaganmohan Reddy Fires On Chandrababu About Tirupati Stampede1
బాబే మొదటి ముద్దాయి: వైఎస్‌ జగన్‌

వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చి­నట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనే­వాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మా­టికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ ఫోర్స్‌ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్‌ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్‌ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్‌.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు. – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిస­లా­టలో గాయపడి, పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చా­యని చెప్పారు. ‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్‌ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పం­లో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీ­సులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్‌ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది చనిపోనట్టు ఎఫ్‌ఐఆర్‌లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్‌ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యా­మ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వది­లేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్‌ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టప­రిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్‌ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికా­రులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచ­గా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు⇒ గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్‌ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్‌ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వా­య్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌ పేరుతో నా కాన్వాయ్‌ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహ­రిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.చిన్న కేసుగా పక్కన పడేసే కుట్రభక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరో­సారి టీటీడీలో బ్లాక్‌ మార్కుగా నిలిచిపోయే ఘట­నకు కారణమయ్యాడు. దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీ­డీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.తప్పంతా చంద్రబాబుదే ⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్‌ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్‌ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకో­లేదా? భక్తుల కోసం పోలీసుల కేటా­యింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యు­రిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? ⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్‌లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్‌ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్‌. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే.

KSR Comment: Chandrababu No Regret on Tirupati Stampede2
తప్పు ఒప్పుకోకుంటే పాపం తగలదా?

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రంగులు మార్చే బుద్ధి చూపిస్తే... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ తొలిసారి కొంత స్వతంత్ర ధోరణి, మరికొంత స్వామి భక్తి చూపే ప్రయత్నం చేశారు. దుర్ఘటన జరిగినందుకు ప్రజలకు, భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా పవన్‌ ఆ పని చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అధికారులుపై చిర్రుబుర్రులాడినట్లు, వేటు వేసినట్లు కనిపించారు. కానీ.. తనకు కావాల్సిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారన్న సంగతి అర్థమైపోతుంది. ..ఇంతటి ఘోరమైన దుర్ఘటన జరిగినా అందులోనూ రాజకీయం చేస్తూ ఎలాగోలా నెపం వైఎస్సార్‌సీపీ(YSRCP)పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రుద్దాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో టీటీడీ పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో, ఉన్నతస్థాయిలో ఉన్నవారి మధ్య గొడవలు ఏ రకంగా ఉన్నాయో బట్టబయలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎదుటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు తీవ్ర స్థాయిలో ఏకవచనంతో దాడి చేసుకున్న వైనం, ఆరోపణలు గుప్పించుకున్న తీరును టీడీపీ జాకీ పత్రికే బహిర్గతం చేయడం విశేషం. టీటీడీ అధ్యక్ష పదవికి బీఆర్‌ నాయుడును నియామకాన్ని ఆ జాకీ పత్రిక యజమాని వ్యతిరేకించారు. అయినా మంత్రి లోకేష్ పట్టుబట్టి నియమించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్‌లో భూ దందాలు చేస్తున్నారంటూ ఈ పత్రిక కొద్ది రోజుల క్రితం ఒక కథనాన్ని ఇచ్చింది. అయినా చంద్రబాబు స్పందించకపోగా, తన వెంటే తిప్పుకుంటున్నారు. తిరుపతికి వెళ్లిన సందర్భంలో కూడా చంద్రబాబు వెంటే ఆయన ఉన్నారు. బహుశా ఈ కోపంతోనే గొడవ సమాచారాన్ని ఈ పత్రిక బయట పెట్టి ఉండవచ్చు. ఉద్దేశం ఏమైనా, రాజకీయాలు ఎలా ఉన్నా, ప్రజలకు కొన్ని వాస్తవాలను చెప్పిందని ఒప్పుకోవచ్చు. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు వేశారు. కానీ వారిలో కీలకమైన అధికారులు లేరు. తిరుపతి ఎస్పీ సుబ్బనాయుడును బదిలీ చేయాల్సి రావడం ఆయనకు ఇబ్బంది కలిగించేదే. సాధారణంగా ఇంతమంది మరణానికి బాధ్యుడుగా ఎస్పీని సస్పెండ్ చేయాల్సి ఉండిందని చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, రెడ బుక్ రాజ్యాంగం అమలుకు ఏరి కోరి తెలంగాణ నుంచి తెచ్చుకోవడం వల్ల బదిలీతో సరి పెట్టారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవో శ్యామలరావును, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని టచ్ చేయలేదు. కాకపోతే వారిపట్ల ఆగ్రహం ప్రదర్శించినట్లు వీడియో లీక్ అయ్యేలా చూసుకున్నారు. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపిన నెయ్యి వాడారని పిచ్చి ఆరోపణను చంద్రబాబు చేసిన అంశంలో వాస్తవాలు శ్యామలరావుకు తెలుసు. పొరపాటున ఆయన అప్పుడు జరిగిన విషయాలపై నోరు తెరిస్తే అది చంద్రబాబుకు ఇరకాటం అవుతుంది. వెంకయ్య చౌదరి చాలాకాలం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. ఇతర సామాజిక వర్గాల అధికారులపై వేటు వేసి తన సామాజికవర్గం అధికారిని మాత్రం చంద్రబాబు రక్షించుకుంటున్నారని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల కొండపై ఈవో కన్నా ,వెంకయ్య చౌదరి పెత్తనమే అధికంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే చనువు ఉండడమే కారణమట. ఈవో, ఏఈవోల మధ్య సఖ్యత లేదు. వీరిద్దరికి, ఛైర్మన్‌కు సత్సంబంధాలు లేవు. బిఆర్ నాయుడు తనకు పదవి రావడంతో చేయవలసింది ఏమిటో తెలియని పరిస్థితిలో పెత్తనం చేయబోతే అధికారులు సహకరించడం లేదు. లోకేష్‌కు ఆప్తుడనైన తననే అవమానిస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తొక్కిసలాట కారణంగా ఆరు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో జన సమూహాలను సమర్థంగా నిర్వహించగల టీటీడీ అప్రతిష్ట పాలైంది. ఇక్కడ ఇంకో కారణం కూడా చెబుతున్నారు. జనసేనకు నాయకుడు టోకెన్లు ఇచ్చే చోట ఏభై మంది కార్యకర్తలను లోపలికి పంపించడం కూడా తొక్కిసలాటకు ఒక కారణమైందని ఒక పత్రిక రాసింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. గత అనుభవాలను చూస్తే ఆయన ఫలితం ఏమంత గొప్పగా ఉండదని ముందగానే చెప్పేయవచ్చు. గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మరణించినప్పుడు కూడా ఇలాగే విచారణ కమిషన్‌ వేశారు. ఉన్నతాధికారుల మాట అటుంచండి.. కనీసం ఒక్క కానిస్టేబుల్‌పై కూడా చర్య తీసుకోలేదు. పైగా ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు చేసిన ఫొటోషూట్‌ కళ్లెదుటే ఉన్నప్పటికీ ఆయన తప్పేమీ లేదన్నట్టు కమిషన్‌ నివేదిక ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కూడా ఇలాగే అవడం గ్యారెంటీ! చంద్రబాబు ఇప్పటివరకూ బి.ఆర్‌.నాయుడు రాజీనామా కోరలేదు. టీవీ ఛానల్‌ యజమాని అని ఊరుకున్నారో.. లోకేశ్‌ మనిషి కాబట్టి చూడనట్లు వ్యవహరిస్తున్నారో తెలియదు మరి! నైతిక బాధ్యత వహించి బీఆర్‌ నాయుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది కానీ పదవి, అధికారం రుచి మరగిన తరువాత వదులుకోవడం కష్టమని అనుకుని ఉండాలి.ఇక చంద్రబాబు మాట్లాడిన కొన్ని అంశాలు చూడండి. దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్యానించడం ఎంత దుర్మార్గం?. ప్రభుత్వ, టీటీడీ అధికారుల, పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే, ఆయన నెపం వైసీపీపై రుద్దడానిక ప్లాన్ చేశారు. ఎల్లో మీడియా ఇప్పటికే ఈ ప్రయత్నం ఆరంభించింది. ఏటా తిరుపతి వాసుల కోసం ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తుంటే, ‘‘అసలు టోకెన్లు ఇవ్వడం ఏమిటి? తనకు తెలియనే తెలియదు’ అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇది బుకాయింపు అవ్వాలి లేదంటే అవగాహన రాహిత్యం కావాలి. ‘‘వైకుంఠ ఏకాదశికి పది రోజుల పాటు టోకెన్లు ఇచ్చి ప్రత్యేక దర్శనం కల్పించడం ఏమిట’’ని ఆయన అంటున్నారు. దాని ద్వారా లక్షలాది మంది భక్తుల కోరిక ను గత ప్రభుత్వం తీర్చిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. అసలు తిరుమలకు సంబంధించి తనకు తెలియని విషయం ఉండదని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. అదే కరెక్టు అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలల తర్వాత, కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా దానినే ఎందుకు కొనసాగించారు?. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ కొంత సొంత వ్యక్తిత్వంతో మాట్లాడినట్లు అనిపిస్తోంది. నాలుగు లక్షల మంది వచ్చిన ప్పుడు కూడా గతంలో జరగని దుర్గటన ఇప్పుడెలా జరిగిందని ఆయన ప్రశ్నించారట. దీనికి చంద్రబాబు, బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి బదులు ఇవ్వాలి. అంతేకాదు. భక్తులు, ప్రజలు క్షమించాలని కోరారు. ఈ మాట చంద్రబాబు చెప్పలేకపోయారు. గతంలో చంద్రబాబు లడ్డూ కల్తీ అనగానే గుడ్డిగా పవన్ కళ్యాణ్ సనాతని వేషం దాల్చి నానా రచ్చగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. ఈసారి అలా కాకుండా కాస్త జాగ్రత్త పడ్డారన్నమాట. అయితే.. ఆనాడు లడ్డూ విషయంలో అపచారం చేసినందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసి వచ్చిందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఈవో,అదనపు ఈవో, ఛైర్మన్‌లను బాధ్యులను చేస్తే చంద్రబాబు మాత్రం వారిని రక్షించే యత్నం చేశారు. టీటీడీలో ఉన్న విబేధాలను ఆయన అంగీకరించారు. చంద్రబాబు ఆ విభేధాల ఆధారంగా విమర్శలు తనపైకి రాకుండా కథ నడిపించారు. నిజానికి వారందరిని నియమించింది చంద్రబాబే, వారితో శ్రద్దగా పని చేయించకపోగా, రెడ్ బుక్ రాజ్యంగం అంటూ, టీటీడీని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీ ఎలాంటి ఆరోపణలు చేయవచ్చో అనేవాటిపైనే పని చేయించారు. ఇప్పుడు వాటి ఫలితం జనం అనుభవించవలసి వచ్చింది. అసలు పనులు మాని చిల్లర వ్యవహారాలకే టిటిడి బాధ్యులంతా పరిమితం అయ్యారని అంటున్నారు. అధికారులపై, ఛైర్మన్ పై చర్య తీసుకోవాలని, వారిపై కేసులు పెట్టాలని మాత్రం పవన్ చెప్పలేదు. హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అర్జున్‌తోపాటు యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దానిని పవన్ సమర్థించారు. మరి ఇప్పుడు టీటీడీ యాజమాన్యంపై కేసు పెట్టాలని పవన్ ఎందుకు కోరలేదు. వారిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదు. పైగా కొత్తగా కుట్ర కోణం ఉండవచ్చని పవన్ అన్నారు. అంటే ఇక్కడే చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శించారా? సందేహం వస్తోంది.ఇది చంద్రబాబు, పవన్ కలిసి ఆడిన కొత్త డ్రామా అని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోకుండా, మొత్తం డైవర్ట్ చేయడానికి జరుగుతున్న యత్నం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబే తొలి ముద్దాయి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ అధినేత జగన్ అన్నారు. దానికి కారణం బీఆర్ నాయుడును ఛైర్మన్‌గా నియమించడంతో పాటు, అంతవరకు సమర్థంగా పనిచేసిన అధికారులను తప్పించి, తనకు కావల్సిన అధికారులను పోస్టు చేసి ఈ తొక్కిసలాటకు కారణం అవడమే అనేది విశ్లేషణ. తన పబ్లిసిటీ పిచ్చి కారణంగా పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణిస్తేనే బాధ్యత తీసుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనలో బాధ్యత వహిస్తారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు భయం, భక్తి లేవని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుపతి దేవుడును సైతం తన రాజకీయాలకు వాడుకోవడానికి చంద్రబాబు ఎప్పుడు వెనుకాడలేదు. అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చితే అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు. ఆ ఘటన జరిగింది తన ప్రభుత్వ వైఫల్యం వల్ల, పోలీసుల అజాగ్రత్త వల్ల అని చెప్పకుండా చంద్రబాబు తనకు సానుభూతి వస్తుందన్న ఆశతో 2003లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌ను బద్నాం చేసేందుకు తిరుమల లడ్డూతోసహా అనేక అపచారపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఈ ఉదంతంలో దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని దారుణమైన వ్యాఖ్య చేసి మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నట్లుగా ఉంది. ఇది కూడా తిరుమల పట్ల అపచారంగానే భావించాలి. ఏది ఏమైనా ఒక విశ్లేషకుడు అన్నట్లు పాలకుల పాపాలు ప్రజలకు శాపాలవుతుంటాయట. ఇవన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Sankranti Rush: South Central Railway To Run Jan Sadharan Special Trains3
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. 'జన సాధారణ్‌ అన్‌ రిజర్వ్‌డ్‌’ స్పెషల్‌ ట్రైన్లు

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.1) రైలు నంబర్‌ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15, 17 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు నంబర్‌ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.3) రైలు నంబర్‌: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్‌ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదీ చదవండి: పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ4) రైలు నంబర్‌ (08537) విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ అన్‌ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతాయి. జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది.సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లుదక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా 16 జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలే ఈ జన సాధారణ రైళ్లలో వసూలు చేస్తామన్నారు. ఛార్జీల పెంపు భారీగా ఉండదు. ప్లాట్‌ ఫారమ్‌ చార్జీలు కూడా పెంచటం లేదు.చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ఈ సంక్రాంతికి నడపనున్నాం. సిటీ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి కొన్ని బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. చర్లపల్లి కాకుండా సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి’’ అని శ్రీధర్‌ వెల్లడించారు.

TCS Headcount Down By 5370 in Q34
టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకు

భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. ఇందులో 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏకంగా 5,370 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.మొదటి రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న టీసీఎస్.. మూడో త్రైమాసికంలో మాత్రం వేలాదిమందిని బయటకు పంపిది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మొత్తం 6,07,354కు చేరింది. కరోనా మహమ్మారి తరువాత దాదాపు అన్ని కంపెనీలు కోలుకున్నాయి. దీంతో కొన్ని సంస్థలు కొత్త ఉద్యోగులను కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి.ఈ త్రైమాసికంలో 25,000 మంది అసోసియేట్‌లను ప్రమోట్ చేసినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రమోషన్‌ల సంఖ్య 1,10,000 కంటే ఎక్కువకు చేరిందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు. అంతే కాకుండా.. మేము ఉద్యోగి నైపుణ్యం, శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తామని.. వచ్చే ఏడాది అధిక సంఖ్యలో క్యాంపస్ నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.వచ్చే ఏడాది 40,000 ఉద్యోగాలు2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్‌మెంట్స్‌ ఉంటాయని.. వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ (Milind Lakkad) అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం.19 ఏళ్లలో ఇదే మొదటిసారిడిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల వలసలు 13 శాతం పెరిగింది. అంతకు ముందు ఇది 12.3 శాతంగా ఉంది. ముంబై (Mumbai) కేంద్రంగా సేవలందిస్తున్న టీసీఎస్ కంపెనీ 2004లో మార్కెట్లోకి లిస్ట్ అయింది. అప్పటి నుంచి (19 సంవత్సరాల్లో) సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 22,600 పెంచుకుంది. అంతకు ముందు 2022లో 1.03 లక్షల ఉద్యోగులను చేర్చుకుంది.టీసీఎస్‌ లాభం రూ.12,380 కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్‌ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.పండుగల సీజన్‌ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ.. భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ (K Krithivasan) పేర్కొన్నారు.

Game Changer Movie Review And Rating In Telugu5
‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌ : గేమ్‌ ఛేంజర్‌నటీనటులు: రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి, నవీన్‌ చంద్ర, నాజర్‌ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్‌. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్‌, చరణ్‌ ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్‌ మినిస్టర్‌ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్‌ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయిన రామ్‌ నందన్‌(రామ్‌ చరణ్‌).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్‌ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్‌ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్‌ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్‌ చరణ్‌) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్‌ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్‌ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్‌ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్‌ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్‌(Shankar) అద్భుతమైన ఫిల్మ్‌ డైరెక్టర్‌. అందులో డౌటే లేదు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్‌మెన్‌, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్‌ తర్వాత శంకర్‌ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్‌ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్‌ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్‌ సుబ్బరాజ్‌ అందించిన రొటీన్‌ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్‌ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్‌లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్‌ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్‌ కొట్టదు. మదర్‌ సెంటిమెంట్‌, తండ్రి ఎపిసోడ్‌ సినిమాకు ప్లస్‌ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్‌ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్‌ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్‌ వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్‌ కాకపోవడంతో ఆ సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్‌, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్‌ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్‌ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్‌ నందన్‌ మధ్య సాగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ బెటర్‌. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్‌ చరణ్‌(Ram Charan) నటన ఏంటో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్‌ నందన్‌ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్‌.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్‌ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్‌ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్‌, ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్‌ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్‌జే సూర్యది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పొలిటిషీయన్‌ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్‌ నందన్‌ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్‌, సైడ్‌ సత్యంగా సునీల్‌ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్‌లో కనిపిస్తారు. జయరాం, నవీన్‌ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్‌ మార్క్‌ గ్రాండ్‌నెస్‌ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్‌ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

What is Benching Dating?  warning signs and prevention6
బెంచింగ్‌ డేటింగ్‌ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!

డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్‌లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్‌లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్‌ డేటింగ్‌. అసలేంటి బెంచింగ్‌ డేటింగ్‌? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్‌ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్‌లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్‌ ఆప్షన్‌ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్‌ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్‌ లాంటి వారు. ఈ డేటింగ్‌లో బెంచింగ్‌ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్‌లో బెంచ్‌మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్‌గా కమెంట్‌ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్‌మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.బెంచ్‌మార్కింగ్ సంకేతాలుప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటంఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం తమ రిలేషన్‌ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడంఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్‌ ఫుడ్‌ ఈ లడ్డూ...అంతేనా! జాగ్రత్తలుపైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిమ్మర్ డేటింగ్ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం ‍ మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది.

Tirupati Stampede Incident: KA Paul Slams CM Chandrababu7
బాబు ఎక్కడుంటే అక్కడ మరణాలే!: కేఏ పాల్‌

సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులను చేస్తూ అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసింది చూశాం. అయితే ఈ పరిణామంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌(KA Paul) స్పందించారు. బహుశా చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మరిచిపోయి అలా ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు.తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఆ టైంలో ప్రధాని, పవన్‌లతో చంద్రబాబు పొలిటికల్ ర్యాలీతో బిజీగా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన. కాబట్టి చంద్రబాబే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఘటనకు బాధ్యులను చేస్తూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తానే సీఎం అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు.చంద్రబాబు(Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు.. 2019లో పుష్కరాల సమయంలో 20 మందికి పైగా చనిపోయారు.. మరెందరో గాయపడ్డారు. కందుకూర్లో పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తే అక్కడా చనిపోయారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తే ముగ్గురు చనిపోయారు. తారకరత్న కూడా చంద్రబాబు ర్యాలీలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు.సమస్యలను పక్కన పెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్‌ డిమాండ్‌ చేశారు.

Robin Uthappa accuses Virat Kohli of axing Yuvraj Singh from Team India8
'కోహ్లి వల్లే యువీ రిటైర్మెంట్‌'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట కోహ్లి(Virat Kohli)పై మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రాబిన్ ఉత‌ప్ప(Robin Uthappa) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్‌ యువ‌రాజ్‌ సింగ్(Yuvraj Singh) త‌న‌ అంతర్జాతీయ కెరీర్‌ను ముందుగానే ముగించడానికి విరాట్ కోహ్లినే కార‌ణ‌మ‌ని ఉత‌ప్ప ఆరోపించాడు.అదేవిధంగా యువరాజ్‌ క్యాన్స‌ర్‌తో పోరాడి తిరిగి ఎలా క‌మ్‌బ్యాక్ ఇచ్చాడో ఓ ఇంటర్వ్యూలో రాబిన్ వివ‌రించాడు. కానీ రీ ఎంట్రీలో యువీకి అప్ప‌టి కెప్టెన్‌గా ఉన్న కోహ్లి నుంచి ఎటువంటి స‌పోర్ట్ ల‌భించ‌లేద‌ని ఈ కర్ణాట‌క మాజీ క్రికెటర్‌ వెల్ల‌డించాడు."యువరాజ్‌ భాయ్‌ జర్నీ ఎంతో మంది యువ క్రికెట‌ర్ల‌కు స్పూర్తిదాయకం. అత‌డు ఏకంగా క్యాన్స‌ర్‌ను జ‌యించి, తిరిగి అంత‌ర్జాతీయ క్రికెట్ వైపు రావ‌డానికి ప్ర‌య‌త్నించాడు. భార‌త్‌కు ఒంటి చేత్తో వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన వ్య‌క్తి. అంతేకాకుండా త‌న కెరీర్‌లో రెండు ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను సొంతం చేసుకున్నాడు. అటువంటి ఆట‌గాడికి మనం చాలా గౌర‌వం ఇవ్వాలి. కానీ విరాట్ కోహ్లి నుంచి మాత్రం అత‌డికి ఎటువంటి మ‌ద్దతు ల‌భించ‌లేదు.కెప్టెన్ అయ్యాక కోహ్లి మారిపోయాడు. యువీ ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచి కోలుకున్నాడో ద‌గ్గ‌రుండి చూసిన వ్యక్తులలో కోహ్లి ఒక‌డు. అలాంటిది ఫిట్‌నెస్ లేద‌ని యువీని ప‌క్క‌న పెట్ట‌డం స‌రికాదు. నాకు ఈ విష‌యాలు ఎవ‌రూ చెప్ప‌లేదు. నేను అన్ని విషయాలను గమనించాను. కెప్టెన్‌గా ఫిట్‌నెస్ లెవ‌ల్స్‌ను ప‌రిగణ‌లోకి తీసుకోవ‌డాన్ని నేను త‌ప్పుబ‌ట్ట‌డం లేదు.కానీ ప్ర‌తీ రూల్‌కు కొన్ని మినహాయింపులు ఉంటాయి. త‌ను సాధించిన విజయాల‌కు కాదు, క్యాన్సర్‌ను ఓడించినందుకైనా యువీని జ‌ట్టులో కొన‌సాగించాల్సింది. ఆ స‌మ‌యంలో అత‌డు నిజంగా క‌ష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా యువీ ఫిట్‌నెస్ టెస్టులో రెండు పాయింట్లు త‌నకు త‌గ్గించ‌మ‌ని కూడా అభ్య‌ర్ధించాడు. అందుకు కూడా జ‌ట్టు మేనెజ్‌మెంట్ సానుకూలంగా స్పందించ‌లేదు. దీంతో అత‌డు ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో విఫ‌ల‌మ‌కావ‌డంతో జ‌ట్టులోకి తీసుకోలేదు. ఆ త‌ర్వాత ఏదో విధంగా ఫిట్‌నెస్ టెస్టును క్లియ‌ర్ చేసి జ‌ట్టులోకి వ‌చ్చాడు. కానీ పేల‌వ ఫామ్‌ను క‌లిగి ఉన్నాడని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. కనీసం ఆ త‌ర్వాత అయినా అత‌డికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. విరాట్‌ కోహ్లి సైతం యువీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. దీంతో అత‌డు త‌న కెరీర్‌ను ముగించాడు" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా 2000లో టీమిండియా త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన యువ‌రాజ్‌.. త‌న కెరీర్‌లో మొత్తంగా 402 మ్యాచ్‌లు ఆడాడు. 402 మ్యాచ్‌ల్లో ఈ పంజాబ్ ఆట‌గాడు 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. 2007, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను భార‌త్ సొంతం చేసుకోవ‌డంలో యువీది కీల‌క పాత్ర‌.చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్‌ వైరల్‌

 If Vietnam Style Traffic Rules Come To India9
నో డౌట్‌ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తారు..!

ఇటీవల కాలంలో ఎంతలా ట్రాఫిక్‌ నిబంధలు పెట్టినా..ఘెరమైన యాక్సిడెంట్‌లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేగాదు ఎందరో తల్లులకు కడుపుకోత, తీరని వ్యథ మిగులుతుంది. ప్రధానంగా మొబైల్‌ ఫోన్‌లు, నిర్లక్ష్య ధోరణి, తొందరపాటులే ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు. అక్కడికి దీనిపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం లేదు. ఏం చేస్తే ఈ సమస్యని నివారించగలమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రేంజ్‌లోనే హైవేలపై స్పీడ్‌ ఉండాలని నియంత్రించినా..ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే సమస్యను ఫేస్‌ చేస్తున్న వియత్నాం దేశం అమలు చేస్తున్న ట్రాఫిక్‌ చట్టాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలా అయినా ప్రమాదాలు తగ్గుతాయేమో అనే ఆశను రేకెత్తించింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి ట్రాఫిక్‌ చట్టాలను తీసుకొచ్చింది..? మన దేశంలో సాధ్యమేనా..?వియత్నాం(Vietnam) రోడ్డు ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు నియంత్రించేందుకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది. ఎవ్వరైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారి గురించి సమాచారం అందిచినట్లయితే వారికి ప్రభుత్వం దాదాపు రూ. 17 వేలు వరకు ప్రోత్సహకాన్ని అందుకోవచ్చు. ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్‌ క్రమశిక్షణ(Traffic Rules) అమలయ్యేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వియత్నాం. నిజానికి గతేడాది ప్రారంభ నుంచే వియత్నాం ట్రాపిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి భరించలేని స్థాయిలో జరిమానాలు పెంచేసింది. రెడ్‌ సిగ్నల్‌ ఉండగానే పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడం తదితరాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఏ పౌరుడైనా సమాచారం(reporting) అందిస్తే..వారి గోప్యతను భద్రంగా ఉంచడమే గాక వాళ్లకి పడిన జరిమానా నుంచి మినహాయింపు లేదా తగిన విధంగా ప్రోత్సాహకం ఇవ్వడం వంటివి చేస్తోంది. అంతేగాదు వారు నడిపే వాహనం అనుసరించి జరిమానాలను భారీగా పెంచింది. అలాగే పారితోషకం కూడా ఆ విధమైన డిఫరెన్స్‌తోనే భారీగా ముట్టచెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో నెటిజన్లు ఆ దేశానికి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఉన్న మనదేశంలో కూడా వాటిని అమలు చేస్తే చాలామంది మిలియనీర్లుగా మారతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు(NITI Aayog member) అరవింద్ విర్మాణితో సహా చాలామంది మాత్రం తప్పనిసరిగా భారత్‌లో కూడా ఇలాంటి రూల్స్‌ని అమలు చేయాలని వాదిస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేస్తే సంపాదన సామర్థ్యం కష్టమైపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకకంగా ఇది ఇరు దేశాల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఎంతలా ఉన్నాయనేది హైలెట్‌ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒకరకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారన్ని అందించిందని చెప్పొచ్చు.We should definitely introduce this for major traffic offenses like going the wrong way on a divided highway/street, and jumping red lights https://t.co/tTkpwoIXck— Dr Arvind Virmani (Phd) (@dravirmani) January 5, 2025 (చదవండి: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో మెనూ ఇలా ఉంటుందా..! 24 క్యారెట్ల బంగారం..)

Supreme Court Frees Prisoner After 25 Years Check Full Details Here10
న్యాయస్థానాలే నిర్లక్ష్య ధోరణితో తప్పులు చేస్తే..!

సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. హైకోర్టు, ఆపైన సుప్రీం కోర్టు కూడా కోర్టు తీర్పునే సమర్థించాయి. క్షమాభిక్ష కోరితే.. రాష్ట్రపతి సున్నితంగా తిరస్కరించారు. కొడుకు కోసం అతని తల్లి మరోసారి రాష్ట్రపతి భవన్‌ తలుపు తట్టింది. ఈసారి రాష్ట్రపతి కనికరించి జీవితఖైదుగా శిక్షను మార్చారు. కట్‌ చేస్తే.. దాదాపు 25 ఏళ్ల తర్వాత అతని విషయంలో పెద్ద తప్పే జరిగిందని దేశసర్వోన్నత న్యాయస్థానమే ఒప్పుకుంది. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏంటా తప్పు?.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే..వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అయితే నిందితులతో పాటు దోషులకూ మన చట్టాలు కొన్ని హక్కులు కల్పిస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయస్థానాలే నిర్లక్ష్యం చేస్తే..?! ఫలితంగా ఓం ప్రకాశ్‌లాగా పాతికేళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది.ఉత్తరాఖండ్‌కు చెందిన ఓం ప్రకాశ్‌(Om Prakash).. తన యజమానితో పాటు అతని కుటుంబాన్ని హతమార్చిన కేసులో నిందితుడు. 1994లో ఈ నేరం జరిగింది. నేరం రుజువు కావడంతో 2001లో ట్రయల్‌ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే నేరం జరిగిననాటికి అతను మైనర్‌. తన కొడుకు మైనర్‌ అని మరణశిక్షపై అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు.. నిందితుడి పేరిట ఉన్న బ్యాంక్‌ పాస్‌బుక్‌ ఆధారంగా నేరం జరిగిన నాటికి అతనికి 20 ఏళ్లని అధికారులు వాదించారు. కోర్టు ఓం ప్రకాష్‌ తల్లి అభ్యర్థనను పక్కనపెట్టి మరణశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు. అయితే అక్కడా ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ పిటిషన్లు వేస్తే వాటిని కొట్టేశాయి. దీంతో చివరి అవకాశంగా ఆమె రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. అయితే మొదటి పిటిషన్‌ తిరస్కరణకు గురికాగా.. 2012లో రెండో పిటిషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కాకుంటే.. ఓం ప్రకాశ్‌కు 60 ఏళ్లు వచ్చేదాకా జైల్లోనే ఉంచాలంటూ సూచించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అతని తల్లి మరో పిటిషన్‌ వేసినప్పటికీ.. అది చెల్లదంటూ రిజిస్ట్రీ కొట్టిపారేశారు. 2019లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేస్తే.. అదీ తిరస్కరణకే గురైంది. చివరకు.. సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ ఆధారంగా బోన్‌ ఆసిఫికేషన్(ఎముక పరిణామంచెందే క్రమం) పరీక్ష నిర్వహించగా.. నేరం జరిగిననాటికి అతని వయసు 14 ఏళ్లుగా తేలింది!. అంతేకాదు.. సమాచారం హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల వయసువాళ్లకూ బ్యాంక్‌ అకౌంట్‌ ఉండొచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌(Juvenile Justice Act) 2015 ప్రకారం.. జువైనల్‌కు కఠిన శిక్షలు విధించరాదని మన చట్టం చెబుతోంది. కానీ, ఈ కేసులో ఓం ప్రకాశ్‌కు ఏకంగా మరణశిక్ష విధించాయి కోర్టులు. అయితే.. ఈ తరహా కేసుల్లో శిక్షలు ఖరారైన తర్వాత కూడా నిందితుడి మైనర్‌ అని నిరూపించుకునేందుకు పిటిషన్‌ వేయొచ్చు. అందుకు సెక్షన్‌ 9(2) వెసులుబాటు కల్పించింది. అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఓం ప్రకాశ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించాయి. సెక్షన్‌కు విరుద్ధంగా ప్రవర్తించాయి.‘‘మన దేశంలో న్యాయస్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటిది ఇలాంటి కేసుల్లో.. అభ్యర్థలను కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలి. నిర్లక్ష ధోరణితో పక్కన పడేయకూడదు. 2015 జువైనల్‌ చట్టం.. పిల్లలను అపరాధిగా కాకుండా బాధితుడిగా పరిగణించాల చెప్పింది. వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలోకి పంపించి పునరావాసం కల్పించాలని చెబుతోంది. అయితే ఇక్కడ కోర్టులు చేసిన తప్పిదానికి అప్పీలుదారుడు శిక్షను అనుభవించాడు. సమాజంలో కలిసిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. తన తప్పులేకుండా అతను కోల్పోయిన కాలాన్ని ఎలాగూ వెనక్కి తేలేము’’ అంటూ జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. మరేయిత కేసులతో గనుక అతనికి సంబంధం లేకుంటే తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ ఉత్తరాఖండ్‌ జైళ్ల శాఖను ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అతనికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉ‍త్తరాఖండ్‌ స్టేట్‌ లీగల్‌సర్వీసెస్‌ అథారిటీకి ధర్మాసనం సూచించింది.1994లో ఏం జరిగిందంటే..డెహ్రాడూన్‌(Dehradun)లో ఓ ఇంట్లో జరిగిన హత్యలు కలకలం రేపాయి. శ్యామ్‌లాల్‌ ఖన్నా అనే రిటైర్ట్‌ ఆర్మీ ఆఫీసర్‌ను, ఆయన కొడుకు సరిత్‌, భార్య సోదరిని ఎవరో కిరాతకంగా హతమార్చారు. పోలీసుల విచారణలో ఆ ఇంట్లోనే పని చేసే ఓం ప్రకాశ్‌ పనేనని తేలింది. ఐదేళ్ల గాలింపు తర్వాత పశ్చిమ బెంగాల్‌లో నిందితుడ్ని, అతని స్నేహితుడు నితేష్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో నితేష్‌ ప్రమేయం లేదని తేలడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.ప్రతీక్‌ చాదా అనే లాయర్‌ సుప్రీం కోర్టులో ఓం ప్రకాశ్‌ తరఫున పిటిషన్‌ వేయగా.. ఎస్‌ మురళీధర్‌ ఓం ప్రకాశ్‌ తరఫున వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తరఫున అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌, అడ్వొకేట్‌ వన్షజా శుక్లా వాదనలు వినిపించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
కోల్డ్‌ కాఫీ చేసిన రాహుల్‌ గాంధీ, వైరల్‌ వీడియో

కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియ

title
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’

దాదర్‌: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింత

title
ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ

ఒట్టావా : కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో (justin trudea

title
న్యాయస్థానాలే నిర్లక్ష్య ధోరణితో తప్పులు చేస్తే..!

సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.

title
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పోలీసులకు చిక్కిన విద్యార్థి

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులకు సంబం

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement