Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan May 3 Election Campaign Schedule ongole narasaraopeta
సీఎం జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారానికి సంబంధించిన ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్‌ ‌విడుదల చేశారు. సీఎం జగన్‌ రేపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం స్టీమెర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట  పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో  పామురు బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Jagan Kosam Siddham YSRCP Taking Manifesto To Every House
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో

గుంటూరు, సాక్షి: పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల  ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా  ఉంటున్నాయి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్‌ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్‌ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు   మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్‌ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్‌ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎ‍స్సార్‌సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్‌ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన.  దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని  వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

BJP Drops Brij Bhushan Amid Harassment Charge Fields His Son
బ్రిజ్‌భూషణ్‌కు హ్యాండ్‌ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్‌ ఎంపీకి నో ఛాన్స్‌

పార్టీ సీనియర్‌ ఎంపీ, మాజీ రెజ్లింగ్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్‌ శరణ్‌ సింగ్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని కైర్‌గంజ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయనకు ఈసారి బీజేపీ మొండిచేయి చూపింది. గతంలో భూషన్‌పై జాతీయ స్థాయి రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కైర్‌గంజ్‌ నుంచి ఆయన కొడుకు కరణ్‌ భూషన్‌ సింగ్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.లోక్‌సభ అయిదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి తుదిగడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ  నేడు అభ్యర్థని ప్రకటించింది. కాగా బ్రిజ్‌భూషన్‌ సింగ్‌ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. చివరి మూడు సార్లు పర్యాయాల్లో (2009, 2014, 2019) కైసర్‌గంజ్‌‌ ఎంపీగా గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. అయితే బ్రిజ్‌భూషన్‌ గత రెండేళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై జాతీయ రెజర్లు చేసిన తీవ్ర ఆరోపణలు అప్పట్లో రాజకీయపరంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో గతేడాది రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే విజయవకాశాలను దెబ్బతీస్తాయనే ఆలోచనతో అభ్యర్థిని మార్చేందుకు మొగ్గు చూపింది. అయితే బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని ఆయన కుమారుడిని బరిలో దింపింది.కరణ్‌ పేరుతోపాటు కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ అభ్యర్థిని సైతం బీజేపీ ప్రకటించింది. రాయ్‌బరేలీలో ప్రతాప్‌ సింగ్‌ను బరిలో నిలిపింది. ఇప్పటికీ కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని వెల్లడించలేదు. గతంలో ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లారు.

Old People Problems For Pension Due To Chandrababu Conspiracies
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా  బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న 

Sunrisers Hyderabad wins the toss and opts to bat first
రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌.. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ! తుది జ‌ట్లు

ఐపీఎల్-2024లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. హైద‌రాబాద్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఒకే మార్పుతో బ‌రిలోకి దిగింది. స్టార్ బ్యాట‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్ స్ధానంలో ఆల్‌రౌండ‌ర్ మార్కో జానెస‌న్ తుది జ‌ట్టులో వ‌చ్చాడు. మ‌రోవైపు రాజ‌స్తాన్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. కాగా ఈ మ్యాచ్ రాజ‌స్తాన్ కంటే ఎస్ఆర్‌హెచ్‌కు చాలా కీల‌కం. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో ఉన్న రాజ‌స్తాన్ త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకోగా.. స‌న్‌రైజ‌ర్స్ మాత్రం పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్ధానంలో నిలిచింది.తుది జ‌ట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మసన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్

Salaar Bike Contestant Winner
ఒక్క మెసేజ్‌తో 'సలార్‌' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సలార్‌. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. కొద్దిరోజుల క్రితమే బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ క్రమంలో సినిమా చూస్తూ సలార్‌ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని స్టార్‌ మా వారు అవకాశం కల్పించారు. తాజాగా విన్నర్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోన్‌ స్టార్‌ మా షేర్‌ చేసింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్‌ చేసిన ‘సలార్‌’ రెండో భాగం ‘శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్‌ నీల్‌. ప్రీ ప్రోడక్షన్‌ వర్క్‌ పూర్తి కావస్తుండటంతో కొద్దిరోజుల్లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్‌  మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్‌ ప్రకటించింది. ఏ విధంగా సలార్‌ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్‌ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విజయవాడకు చెందిన వరప్రసాద్‌ అనే వ్యక్తి సలార్‌ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలను వీడియో ద్వారా మేకర్స్‌ ప్రకటించారు.ఏప్రిల్‌ 21న సలార్‌ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలని ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్‌ చేసి పంపించాలని మేకర్స్‌ కోరారు. ఈ ఎస్సెమ్మెస్‌లను డిప్‌ ద్వారా ఎంపిక చేస్తామని ఆ సమయంలో ప్రకటించింది. వారు చెప్పినట్లుగానే సలార్‌ బైక్‌ను విజేత వరప్రసాద్‌కు అందచేశారు.     View this post on Instagram           A post shared by STAR MAA (@starmaa)

Heavy Rains in Dubai Several Flights Cancelled
దుబాయ్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు

రెండు వారాలకు ముందు దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు.

gold price today rate down may 2
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్‌, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.7600 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.

32 Year Old Man Dies After Fainting At Varanasi Gym
జిమ్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్‌

ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేస్తూ  కుప్పకూలి  ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ   అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు.  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్‌ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్‌నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం పెట్టే దీపక్‌  రోజూలాగానే జిమ్‌కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది.  నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్‌ను  అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్‌ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది. 

Ajit Agarkar Reveals Reason For Rinku Singhs Snub From T20 World Cup Squad
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్‌ చేయలేకపోయాం'

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ప్ర‌క‌టించిన భార‌త జట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌కపోయిన సంగ‌తి తెలిసిందే. 15 మంది స‌భ్యుల‌తో కూడిన ప్ర‌ధాన జ‌ట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వ‌ని సెల‌క్ట‌ర్లు.. నామ‌మాత్రంగా స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  అద్బుత ఫామ్‌లో రింకూను ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని చాలా మంది మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుబడుతున్నారు.తాజాగా ఈ విష‌యంపై  బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జ‌ట్టులో అద‌న‌పు బౌల‌ర్ అవ‌స‌రం ఉండ‌టంతోనే రింకూను సెల‌క్ట్ చేయ‌లేద‌ని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్‌ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్‌ కాన్ఫ‌రెన్స్‌లో  అగార్కర్ పేర్కొన్నాడు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all