Top Stories
ప్రధాన వార్తలు
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు.
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్- యూజీ పరీక్ష- 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్‌గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్ పేపర్ లీక్ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్‌గా మారుతా. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. నడ్డాను కేబినెట్లోకి తీసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. మోదీతో పాటు నడ్డా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవనుంది. ఈ పదవిని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మంత్రి పదవి ఖరారావడంతో ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని నివాసంలో జరిగిన కాబోయే మంత్రుల చాయ్ భేటీకి నడ్డా హాజరయ్యారు.ఎన్సీపీకి నో చాన్స్కేంద్ర కేబినెట్ పదవుల్లో ఎన్సీపీకి షాక్ తగిలింది. కేంద్ర కేబినెట్లో అజిత్ పవార్ వర్గానికి చాన్స్ దక్కలేదు. ఎన్సీపీ నేతప్రపూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి పదవిని ఆఫర్ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేబినెట్ మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఆఫర్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది తనను అవమానించడమేనన్నారు.
T20 WC 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ (జూన్ 9) మహాసంగ్రామం జరగాల్సి ఉంది. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అయితే ఈ బిగ్ ఫైట్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాడు.మ్యాచ్ ప్రారంభ సమయానికి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు న్యూయార్క్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా టాస్ కూడా నిర్ణీత సమయంలో పడకపోవచ్చని అంచనా. అయితే సమయం గడిచే కొద్ది వరుణుడు శాంతించవచ్చని సమాచారం. ఒకవేళ వరుణుడు మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం కలిగించినా ఓవర్ల కుదింపుతో మ్యాచ్ సాధ్యపడే అవకాశం ఉంది.మ్యాచ్ ప్రారంభానికి రెండున్నర గంటల ముందు అక్కడి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్, పాక్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది.మరోపక్క ఈ మ్యాచ్‌కు కేటాయించబడిన పిచ్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ డ్రాప్ ఇన్ వికెట్ క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్ల పాలిట ఈ పిచ్ సింహస్వప్నంలా మారింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 100కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది.
నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, షార్ప్ షూటర్ సిఫ్త్ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో మెరిసింది. మంచి నటీనటులు ఎందరో..మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్ శర్మ.. నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్ ఖాన్ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.ఆ హీరోలైతేనే..షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్‌దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్
ఇజ్రాయెల్ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా
హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్ కమాండర్ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్ జమెరాను ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. శనివారం హమాస్ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను ఇజ్రాయెల్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ (యమమ్)కమాండర్, టాటికల్ ఆపరేటర్ అర్నాన్ జమోరా నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్ అర్నాన్ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.Behind every rescue mission, are Israeli men and women who risk their lives. We are devastated to share that Chief Inspector Arnon Zamora, commander and tactical operator in the Yamam (National Police Counter-Terrorism Unit), who was critically wounded in the operation to… pic.twitter.com/4P3qRre7Ia— Israel Foreign Ministry (@IsraelMFA) June 8, 2024బాధకలిగించిందిప్రతి రెస్క్యూ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది.అర్నాన్ జమోరా ఎవరు?ఇజ్రాయెల్ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అర్నాన్ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
సినిమా
కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2022లో భూల్ భూలయ్యా- 2తో సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా గతేడాది షెహజాదా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం చందు ఛాంపియన్. ఈ సినిమాను కబీర్ ఖాన్ తెరకెక్కించారు. భారత తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.అయితే భూల్ భూలయ్యా- 2 ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్లారెన్ కారును బహుమతిగా అందుకున్నారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ కారును కార్తీక్‌కు బహుమతిగా ఇచ్చారు.అయితే ఆ కారే ఇప్పుడు హీరోకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆ కారులోని మ్యాట్‌ను ఎలుకలు పాడుచేశాయని ఆయన తెలిపారు. కేవలం మ్యాట్స్ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కారును గ్యారేజీలో పార్క్ చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక్ నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్ జూన్ 14న విడుదల కానుంది.
అనుపమ 'లాక్డౌన్' టీజర్ విడుదల
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్‌ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్డౌన్,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్డౌన్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం విడుదలైన లాక్డౌన్ టీజర్ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్ కాలమాదన్' అనే తమిళ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
సక్సెస్ వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు పొంగిపోతారు. ఛాన్సుల కోసం ఎవరినీ బతిమిలాడాల్సిన పని లేదనుకుంటారు. నటుడు తాహా షా బుద్ధాషా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తాడు. సక్సెస్ వచ్చినా, రాకపోయినా అందరితో పరిచయాలు పెంచుకోవాలి.. మంచి అవకాశాలు సంపాదించుకోవాలని ఆరాటపడతాడు. ఇటీవలే హీరామండి సిరీస్‌లో మెప్పించిన ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు. సక్సెస్ వచ్చిందని పొంగిపోను'సక్సెస్ వచ్చింది కదా అని విశ్రాంతి తీసుకోను. దాన్ని కొనసాగించేందుకు మరింత కష్టపడతాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కరినీ అవకాశాలిమ్మని కలుస్తూనే ఉంటాను. తెలియనివారిని పరిచయం చేసుకుంటాను. ఈ మధ్య కేన్స్‌కు వెళ్లినప్పుడు కొందరు నన్ను గుర్తుపట్టి అంత పెద్ద ప్రాజెక్టులో నటించావ్.. ఇలా ఎందుకు తిరుగుతున్నావ్? అని అడిగారు. స్టార్ అయిపోగానే అందరూ మన దగ్గరకు వచ్చి ఛాన్సులిస్తారని వాళ్లు అనుకుంటున్నారు.అందరినీ పలకరిస్తుంటానేనైతే దాన్ని నమ్మను. అవకాశాల కోసం నా అంతట నేనుగా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఒకవేళ ఎదుటివాళ్లు నన్ను పలకరించకపోయినా నేనే వెళ్లి మాట్లాడిస్తుంటాను. లేదంటే నాకు యాటిట్యూడ్ ఉందనుకుని, నా దగ్గరకు రాకపోవచ్చు. అందుకే అందరితో కలిసిపోతుంటాను. పరిచయాలు పెంచుకుంటాను. కేన్స్‌కు వెళ్లినప్పుడు కూడా నేనేదో ఇండస్ట్రీకి కొత్త వ్యక్తి అయినట్లు నా బయోడేటా కార్డును పంచాను. ప్లీజ్ నాకు ఫోన్ చేయండి, నాతో టచ్‌లో ఉండండి అని చెప్పాను. తిండీనిద్ర మానేసి..వాళ్లు తెల్లారేసరికి నాకేదో సినిమా ఆఫర్ ఇస్తారని కాదు.. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా! తిండీనిద్ర మానేసి పని కోసం తిరుగుతూనే ఉంటాను. కేన్స్ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు కూడా అంతే.. తినడానికి వెళ్తే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందోనని తినడం మానేసి అందరినీ పలకరిస్తూ ఉన్నాను. నాకు పని దొరకనప్పుడైతే దర్శకనిర్మాతల ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేసేవాడిని. వాళ్ల ఇంటి వాచ్‌మెన్‌కు ఏదైనా తినిపించో, జ్యూస్ తాగిపించో వాళ్ల సర్‌తో మాట్లాడించమని చెప్పేవాడిని' అని తాహా షా గుర్తు చేసుకున్నాడు.చదవండి: ‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూసి తీరాల్సిందే. లేదంటే చాలా అంటే చాలా మిస్సవుతారు. పోస్టర్ చూడగానే ఇదేదో పిల్లల మూవీ అనుకుంటారేమో. మొత్తం చూసిన తర్వాత మీ చిన్నారుల్ని ఇంట్లో వదిలి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే అంతలా మిమ్మల్ని డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది. ఓటీటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు! జస్ట్ రూ.45 లక్షల బడ్జెట్‌తో తీశారు. 2018లో రిలీజైన ఈ మూవీలో అంతలా ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉంది? ఓవరాల్ రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 2 వారాల్లోనే ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'పిహు' సినిమా విషయానికొస్తే.. పిహు (పిహు మైరా విశ్వకర్మ) రెండేళ్ల పాప. ఉదయం నిద్రలేచేసరికి తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని పడి ఉంటుంది. ఆమె నిద్రపోతోందేమో అని పిహు అనుకుంటుంది. చాలాసార్లు లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ పాప వల్ల కాదు. అలానే పిహు చిన్నపిల్ల కావడంతో బయటకు రాలేక ఇంట్లోనే చిక్కుకుపోతుంది. ఫ్రిడ్జ్, గ్యాస్, వాటర్ ఫిల్టర్, ఇస్తీ పెట్టె లాంటి వాటి గురించి తెలియకపోవడం వల్ల అన్నింటిని ఆన్ చేసి పెట్టేస్తుంది. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సిట్చ్యూయేషన్ నుంచి పిహు ప్రాణాలతో బయటపడిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.సాధారణంగా చిన్నపిల్లల సినిమాలు చూడటానికి సరదాగా ఉంటాయి. 'పిహు' మాత్రం మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు వణికిపోయేలా చేస్తుంది. ఇందులో కొత్తగా ఏం ఉండదు. ఓ పాప, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ లాంటివి ఆన్ చేసేసి ఇవేంటి ఇంత డేంజర్ అనుకునేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలని ఇంట్లో వదిలి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)ఈ మూవీ అంతా అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లోనే షూట్ చేశారు. కానీ చూస్తున్నంతసేపు ఏ మాత్రం బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? పిహుకి ఏం కాదుగా అని మనం టెన్షన్ పడేలా చేస్తుంది. కేవలం గంటన్నరే ఉంటుంది. కానీ మూవీ పూర్తయిన తర్వాత మనల్ని పిహు పాత్ర వెంటాడుతుంది. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేసి పడేసింది. ఎలా ట్రైనింగ్ ఇచ్చారో, ఏం చేశారో గానీ మూవీ చూసిన తర్వాత మాత్రం పాప క్యూట్‌నెస్, యాక్టింగ్‌కి ఫిదా అయిపోతాం.చాలామంది పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా.. వస్తువులతో ఎలా పడితే అలా ఆడుకుంటూ ఉంటారు. కానీ అవి ఎంత ప్రమాదం అనేది పిల్లలకు కచ్చితంగా చెప్పాలి బాబోయ్ అని 'పిహు' చూసిన తర్వాత మీకు పక్కా అనిపిస్తుంది. ఇప్పటికే మీకు పిల్లలున్నా, త్వరలో పిల్లల్ని ప్లాన్ చేస్తున్నా.. నెట్‌ఫ్లిక్స్‌లో అర్జెంట్‌గా ఈ మూవీ చూడండి. హిందీలో అందుబాటులో ఉంది. వేరే భాష అని కంగారు పడాల్సిందేం లేదు. ఈ మువీలో డైలాగ్స్ కంటే సీన్స్ ఎక్కువ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)
ఫొటోలు
క్రీడలు
T20 WC 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ (జూన్ 9) మహాసంగ్రామం జరగాల్సి ఉంది. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అయితే ఈ బిగ్ ఫైట్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాడు.మ్యాచ్ ప్రారంభ సమయానికి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు న్యూయార్క్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా టాస్ కూడా నిర్ణీత సమయంలో పడకపోవచ్చని అంచనా. అయితే సమయం గడిచే కొద్ది వరుణుడు శాంతించవచ్చని సమాచారం. ఒకవేళ వరుణుడు మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం కలిగించినా ఓవర్ల కుదింపుతో మ్యాచ్ సాధ్యపడే అవకాశం ఉంది.మ్యాచ్ ప్రారంభానికి రెండున్నర గంటల ముందు అక్కడి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్, పాక్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది.మరోపక్క ఈ మ్యాచ్‌కు కేటాయించబడిన పిచ్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ డ్రాప్ ఇన్ వికెట్ క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్ల పాలిట ఈ పిచ్ సింహస్వప్నంలా మారింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 100కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది.
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత్-పాకిస్తాన్ మెగా సమరానికి ముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సొంత జట్టు సారధి బాబర్ ఆజమ్‌పై దుమ్మెతిపోశాడు. విరాట్‌తో బాబర్‌కు పోలిక ఏంటని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ విరాట్ కాలిగోటికి కూడా సమానం కాదని పరుష పదజాలాన్ని వాడాడు. బాబర్ సెంచరీ చేసిన ప్రతిసారి పాక్ అభిమానులు అతన్ని విరాట్‌తో పోలుస్తారని.. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. బాబర్‌ను విరాట్‌తో పోలిస్తే అస్సలు ఒప్పుకోనని అన్నాడు. 16 ఏళ్ల కెరీర్లో విరాట్ 80 సెంచరీల సాయంతో దాదాపు 27000 పరుగులు చేస్తే.. బాబర్ తన తొమ్మిదేళ్ల కెరీర్లో 31 సెంచరీల సాయంతో 13000 పైచిలుకు పరుగులు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు.ప్రస్తుత వరల్డ్‌కప్‌లో యూఎస్ఏపై బాబర్ ఆడిన ఇన్నింగ్స్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పసికూనల బౌలింగ్‌లోనే తేలిపోయిన బాబర్‌కు విరాట్‌తో పోటీపడే అర్హత ఎక్కడ ఉందని నిలదీశాడు. సాధారణ యూఎస్ఏ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలబడిన బాబర్.. ప్రపంచ స్థాయి బౌలర్లను ఏరకంగా ఎదుర్కొంటాడని ప్రశ్నించాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో బాబర్ ఆడిన ఇన్నింగ్సే పాక్ ఓటమికి ప్రధాన కారణమని దుమ్మెత్తిపోశాడు. 44 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్న బాబర్.. విరాట్‌తో సరిసమానమైన ప్లేయర్ అయ్యుంటే చివరి వరకు క్రీజ్‌లో నిలబడి పాక్‌ను గెలిపించేవాడని అన్నాడు. నేటి మెగా సమరంలో భారత్.. పాక్‌ను చిత్తు చేయడం ఖాయమని ఘంటాపథంగా తెలిపాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో పాక్‌పై భారత్ డామినేషన్ (6-1) కొనసాగుతుందని జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పోటీపడే ప్రతిసారి బౌలింగే తమ ప్రధాన బలమని జబ్బలు చరుచుకునే పాక్.. అదే బౌలింగ్ కారణంగా యూఎస్ఏ చేతిలో ఓడిందని అభిప్రాయపడ్డాడు. ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా ఈ మేరకు వ్యాఖ్యానించాడు.కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ తామాడిన తొలి మ్యాచ్‌లో పసికూన యూఎస్ఏ చేతిలో చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను మట్టికరిపించి గెలుపు జోష్‌లో ఉంది. భారత్, పాక్‌లు ఇవాళ (జూన్ 9) న్యూయార్క్ వేదికగా అమీతుమీకి సిద్దమయ్యాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన న్యూయార్క్‌లో మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు న్యూయార్క్ మైదానంలోని పిచ్ ఇరు జట్లను కలవరపెడుతుంది. ఈ పిచ్ ఎవరికీ అంతుచిక్కని విధంగా స్పందిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
WI Vs UGA: దటీజ్ పావెల్.. టీ20 వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భారీ సిక్స్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉగండాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది.ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఫ్రాంక్ న్సుబుగా.. తొలి బంతిని ఆఫ్-స్పిన్నింగ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో ఫ్రంట్ ఫుట్కు వచ్చిన పావెల్.. లాంగ్-ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 105 మీట్లర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌తో సాల్ట్‌ను పావెల్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 74 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc)
WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో పసికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 పరుగులకే ఉగండా కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చెత్త రికార్డు..ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన నెదర్లాండ్స్ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్(44), వెస్టిండీస్(55), ఉగండా(58) ఉన్నాయి.వెస్టిండీస్ అరుదైన రికార్డు..టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
బిజినెస్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది.
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జూన్ 9) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున ఏకంగా రూ.2000లకు పైగా దిగొచ్చిన తులం బంగారం ఈరోజు పెరగకుండా స్థిరంగా కొనసాగడంతో కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 71,670 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.71,820 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,700లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.71,670 లుగా ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.72,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,670 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజున వెండి ధర కేజీకి అత్యంత భారీగా రూ.4500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
అంచనాలను మించి పెరిగిన అమెరికా నియామకాలు
అమెరికాలో ఉద్యోగ వృద్ధి మే నెలలో అంచనాలను అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత నెలలో 2,72,000 ఉద్యోగాలను జోడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1,65,000 నియామకాల కంటే మే నెలలో భారీగా పెరిగినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది.బ్రీఫింగ్ డాట్‌కామ్ (briefing.com) ప్రకారం.. విశ్లేషకులు అంచనా వేసిన 1,85,000 పెరుగుదల కంటే ఇది గణనీయంగా ఎక్కువ. 2023 డిసెంబర్ తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. కాగా ఉద్యోగ వృద్ధితోపాటు నిరుద్యోగం కూడా స్పల్పంగా పెరిగింది. నిరుద్యోగ రేటు 3.9 శాతం నుంచి 4.0 శాతానికి పెరిగిందని ఆ శాఖ పేర్కొంది.అయితే వడ్డీ రేట్లను తగ్గించడానికి సరైన సమయం కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ గణనను క్లిష్టతరం చేస్తాయి. ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రించేందుకు డిమాండ్ తగ్గుతుందనే ఆశతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి నెలల్లో రేట్లను 23 ఏళ్ల గరిష్ట స్థాయికి చేర్చింది.ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలను జోడించడంతో, ఫెడ్ రేటు కోతలను మరికొంత కాలం నిలుపుదల చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో హెల్త్ కేర్, గవర్నమెంట్ వంటి రంగాలతో పాటు విశ్రాంతి, ఆతిథ్యం వంటి రంగాల్లో ఉపాధి పెరిగిందని కార్మిక శాఖ నివేదిక తెలిపింది.
ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కావాలంటే ఇది తప్పనిసరి!
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిఫండ్స్ పొందడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ సైట్లో తమ బ్యాంకు ఖాతాను రీ వ్యాలిడేట్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. బ్రాంచ్ మార్పులు, ఐఎఫ్ఎస్సీ మార్పులు లేదా బ్యాంకు విలీనాల కారణంగా బ్యాంక్ ఖాతా డేటాను అప్డేట్ చేసినప్పుడు రీ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.ట్యాక్స్ పేయర్స్ తమ బ్యాంక్ అకౌంట్లను రీ వ్యాలిడేషన్ చేసుకునేందుకు చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్ లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి. రీ వ్యాలిడేషన్ చేసే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా పాన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అలాగే కొత్త బ్యాంకు ఖాతాను జోడించాలన్నా కూడా ఆ ఖాతాను పాన్‌తో లింక్ చేసి ఉండాలి. యూజర్ కు చెల్లుబాటు అయ్యే ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నెంబరు ఉండాలి.ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను రీవాల్యులేట్ చేయండిలా..స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండిస్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.స్టెప్ 3 'బ్యాంక్ అకౌంట్' ఎంచుకుని రీవాలిడేట్ మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ, ఏసీ టైప్ వంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి.స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.కొత్త బ్యాంకు అకౌంట్‌ను జోడించడానికి..స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండిస్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.స్టెప్ 3: మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయండి (జోడించబడిన, విఫలమైన మరియు తొలగించబడిన బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్ లు డిస్ ప్లే అవుతాయి.)స్టెప్ 4: బ్యాంక్ ఖాతాను జోడించండిస్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి. Kind Attention Taxpayers!✅Having a validated bank account is essential for receiving of refunds. ✅An already validated bank account will require re-validation after updation of account details consequent to change in branch, IFSC, Merger of bank, etc.For Updating existing… pic.twitter.com/9DnuSMaYbP— Income Tax India (@IncomeTaxIndia) June 4, 2024
వీడియోలు
52 మందితో మోడీ క్యాబినెట్
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి
ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్
డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?
మహేష్ బాబును మార్చేస్తున్న రాజమౌళి..
వాజపేయి సమాధి వద్ద మోదీ నివాళులు
మంత్రి పదవి ఎవరెవరికి ?
ఫ్యామిలీ
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..!
ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతోనే ఆమె లైఫ్ టర్న్ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..ఆమె పేరు ప్రియాల్ యాదవ్. ఇండోర్‌కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్‌లో దారుణంగా ఫెయిల్ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.అందుకే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(ఎంపీపీఎస్సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్‌ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి.. తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్ నియమితురాలయ్యింది. తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూనే ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్. ప్రస్తుతం ఆమె ఇండోర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్‌ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్‌కి మారుపేరుగా నిలిచింది. అందరి చేత శెభాష్ ప్రియాల్ అని అనిపించుకుంది. (చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!)
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్ కానేకాదు..
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్లాగానే కనిపించినా, నిజానికిది ఫాస్ట్ ఫోల్డింగ్ ఈ–బైక్. ఇప్పటికే కొన్ని ఫోల్డింగ్ ఈ–బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మడతపెట్టడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది.బ్రిటిష్ కంపెనీ ‘డికాథ్లాన్’ తాజాగా మార్కెట్లోకి ‘బీటీవిన్ ఈ–ఫోల్డ్–900’ పేరుతో తీసుకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం ఒక సెకండులోనే మడతపెట్టి కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఇది 252 డబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేశాక 55 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.బ్రష్‌లెస్ మోటారుతో తయారైన దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు. నగరాలు, పట్టణాల రహదారుల్లోనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో కూడా సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం దీనిని యూరోప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. దీని ధర 1499 పౌండ్లు (రూ.1.59 లక్షలు).ఇవి చదవండి: ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్‌గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫ్రాన్స్‌కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్‌ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్గా తీర్చిదిద్దారు.ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్‌లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్‌లో కూడా మరో బస్సును రెస్టారంట్గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు! ఎందుకో తెలుసా?
కోతులు ఏ చెట్టు మీదకైనా ఇట్టే ఎక్కేస్తాయి. ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగుపెట్టవు. దీనిని ‘శాండ్బాక్స్ ట్రీ’ అంటారు. దీని కాండం నిండా పదునైన విషపు ముళ్లు ఉంటాయి.దాదాపు రెండువందల అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
న్యూస్ పాడ్‌కాస్ట్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మిర్యాలగూడలో గ్యాంగ్‌వార్
మిర్యాలగూడ అర్బన్: సినిమాల ప్రభావంతో నేటి యువత విలనిజమే హీరోయిజంగా ఫీలవుతున్నారు. దీంతో బయట కూడా సినిమాల్లో లాగా అనుకరిస్తూ పెడదోవ పడుతున్నారు. చిన్నచిన్న గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. బర్త్‌డేలకు కూడా డీజేలు పెట్టి బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతూ తమ నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో నిత్యం ఏదో ఒక వీధిలో గ్యాంగ్వార్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దారి తప్పుతున్న యువతను గాడిలో పెట్టేదెవరు..? అని వారి చేష్టలను చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.మత్తుకు బానిసలుగా మారుతున్నారిలా..గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు గుర్తించే అవకాశం ఉండేది. దీంతో ఆ పిల్లాడికి పలు ఉదాహారణలతో మంచి విషయాలపై అవగాహన పెంచేవారు. ఈవిధంగా కుటుంబం నుంచే క్రమశిక్షణ నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేవారు. కానీ మారిన పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాలు పెరగడం, భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తుండడంతో పిల్లలను గమనించేవారు లేకుండా పోతున్నారు. దీంతో పిల్లలు ఏం చేస్తున్నారు..? అతడి మానసిక స్థితి ఏవిధంగా ఉంది..? అని పరిశీలించేవారు లేకపోవడంతో ముందుగా స్నేహితులతో సరదాగా సిగరెట్, గుట్కా వంటి వాటికి అలవాటు పడుతూ క్రమంగా గంజాయి తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మిర్యాలగూడలో గంజాయికి బానిసైన యువకులు సుమారు 2 వేలకు పైగానే ఉంటారని సమాచారం. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసికస్థితిని అర్ధం చేసుకుని వారికి సరైన దిశానిర్ధేశం చేయడం వలన యువత మత్తుకు బానిసలు కాకుండా.. పెడదోవ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.మిర్యాలగూడలో ఇటీవల జరిగిన గ్యాంగ్వార్లు..👉 మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న వైన్స్ వద్ద ఇటీవల రాత్రి సమయంలో కొందరు యువకులు కలిసి ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. దీంతో ఆ యువకుడికి తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.👉రెడ్డి కాలనీకి వెళ్లేదారిలో రాత్రి సమయంలో తల్లీకుమార్తె నడుచుకుంటూ వెళ్తుండగా.. మత్తులో ఉన్న యువకులు వెకిలి చేష్టలు చేయడంతో వారు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.👉 పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఓ వీధిలో గత నెల ఫుట్‌బాల్ ఆటలో తలెత్తిన వివాదంలో రెండు గ్యాంగ్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.👉 పట్టణంలోని తాళ్లగడ్డ, ప్రకాశ్‌నగర్, గాంధీనగర్, బాపూజీనగర్‌లో ప్రతి రోజు ఏదో గొడవ జరగుతుండగా.. గొడవలు పడిన వారు మత్తులో ఉన్నప్పుడే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు.పట్టించుకోని పోలీసులు ..రోజురోజుకు పెరుగుతున్న గ్యాంగ్వార్లను అరికట్టాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గొడవలకు దిగిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగానే పలువురు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విడిపిస్తుండటంతో సదరు యువకులు మరింత పెట్రేగిపోతున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ముందుకుపోతే నుయ్యి.. వెనుకకు పోతే గొయ్యి అన్న చందంగా మారిందని, పోలీసులు కూడా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటున్నారని పోలీస్ శాఖ సిబ్బందే చెబుతుండటం విశేషం.యువకుడిపై విచక్షణారహితంగా దాడిమిర్యాలగూడ పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో శుక్రవారం పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ చెలరేగి ఓ యువకుడిపై మరికొంతమంది యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి గురైన యువకుడిని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. గాయాలపాలైన యువకుడు శనివారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దుయువత క్రమశిక్షణతో తమ చదువులు, కెరియర్‌పై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారి మానసికస్థితి, వారి ప్రవర్తనను గమనిస్తూ పెడదోవ పట్టినట్లు తెలిస్తే వెంటనే వారికి ఓపికగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలకు మంచి జీవితం ఇచ్చిన వారమవుతాం. యువత చెడుమార్గం పట్టి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు.– రాజశేఖరరాజు, మిర్యాలగూడ డీఎస్పీ