అనంతపురం.. మీ ఓటు చెక్‌ చేసుకోండి | Sakshi
Sakshi News home page

అనంతపురం.. మీ ఓటు చెక్‌ చేసుకోండి

Published Mon, Mar 11 2019 11:48 AM

Check Your Vote Anantapur - Sakshi

  సాక్షి, అనంతపురం జిల్లా:   

  • నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ www.nvsp.in ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే  search your name    పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  • ఈ ఏడాది జనవరి 11న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్‌ కేంద్రం పరిధిలోని బీఎల్‌ఓలు, తహసీల్దారు, ఆర్‌డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అందులో ఓటు ఉందా లేదా అని వివరాలను పరిశీలించుకోవచ్చు. ఓటు లేనట్లయితే అక్కడే ఫారం–6 పూరించి ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెబుతారు. ఓటు లేనట్లయితే అక్కడే ఫారం–6 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • ఈనెల 15వ తేదీ వరకూ ఓటు నమోదుకు అవకాశం ఉంది.  అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement