పోలీసుల జోక్యంతో ఇంట్లోకి వృద్ధులు | Sakshi
Sakshi News home page

పోలీసుల జోక్యంతో ఇంట్లోకి వృద్ధులు

Published Sat, Jan 13 2018 7:24 AM

Elderly people entry in house with police involved - Sakshi

హిందూపురం అర్బన్‌: ముద్దిరెడ్డిపల్లిలో నివాసమున్న కిష్టప్ప, ఓబుళమ్మ వృద్ధ దంపతులను పెద్దకుమారుడు లక్ష్మినారాయణ, కోడలు కల్పనలు మూడవరోజు శుక్రవారం కూడా ఇంట్లోకి రానివ్వకపోవడంతో సాయంత్రం దాకా బయటే పడిగాపులు కాయాల్సివచ్చింది. రక్తసంబంధాలకు తాళం అనే శీర్షిక సాక్షిలో ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. వన్‌టౌన్‌ ఎస్‌ఐ రంగడు జోక్యం చేసుకుని శుక్రవారం తాళం వేసిన ఇంటివద్దకు వచ్చి.. వృద్ధులను లోనికి పిల్చుకోవాలని, ఆస్తి గొడవలుంటే చర్చించుకోవాలని సూచించారు. అయినా వారు ససేమిరా అన్నారు.

చివరకు సీఐ చిన్నగోవిందు ఇద్దరు కొడుకులు, కోడలు, వారి బంధువులను సాయంత్రం పోలీసుస్టేషన్‌కు పిలిపించి సర్ధిచెప్పారు. ప్రసుత్తం పెద్దకొడుకు ఉంటున్న ఇల్లు వృద్ధులు సంపాదించినదే..అంతేగాక తల్లిదండ్రులను చూసుకోవాల్సి బాధ్యత కొడుకులపై ఉందన్నారు. అలాకాకుండా వారిని లోనికి తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చివరకు పెద్దకొడుకు తన తల్లిదండ్రులను ఇంటిలోనికి తీసుకెళ్లాడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు పోలీసులకు రాతపూర్వకంగా రాసిచ్చారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement