మరో 13 మంది మృతి | Sakshi
Sakshi News home page

మరో 13 మంది మృతి

Published Thu, Jun 19 2014 2:41 AM

13 people died in Sunstroke

మక్కువ: జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమా రు 109 మంది మృతి చెందగా.. బుధవారం మరో 13 మంది మృత్యువాత పడ్డారు. మక్కువ మండలంలోని నంద పంచాయతీ పెదవూటగెడ్డ గ్రా  మానికి చెందిన బాగు సంబరమ్మ(70) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందింది. మూడు రోజులుగా ఎండ వేడిమిని తట్టుకోలేని ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఉదయం 10 గంటలకు బోరు వద్దకు స్నానానికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
 
 గరుగుబిల్లిలో ఒకరు..
 గరుగుబిల్లి: బురదవెంకటాపురం గ్రామానికి చెందిన పెంకి ఎర్రయ్య(19) వడదెబ్బతో మృతి చెందాడు. ఈయన ఎండ ల తీవ్రతకు మూడు రోజుల నుంచి జ్వరం, ఒళ్లు నొప్పిలతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి ఉక్కపోతకు ఒక్కసారిగా అస్వస్థత  కు గురై మృతి చెందాడు.
 
 గాజులరేగలో వృద్ధురాలు...
 విజయనగరం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని గాజులరేగ గ్రామానికి చెందిన బొబ్బిలి నర్సాయమ్మ వడదెబ్బతో మృతి చెందింది. మంగళవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు ఆమె అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వడదెబ్బ తగలడంతో ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
 
 పార్వతీపురంలో వివాహిత ...
 పార్వతీపురం టౌన్: పట్టణంలోని నెయ్యిల వీధికి చెందిన తాళాబత్తుల పద్మ (50) మంగళవారం రాత్రి వడదెబ్బతో మృతి చెందింది. మంగళవా రం మధ్యాహ్నం ఎండ ధాటికి ఆమె సొమ్మసిల్లిపడిపోవడంతో కుటంబ సభ్యులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యు  లు చికిత్స చేస్తుండగానే.. ఆమె మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ కౌన్సిలర్ కోరాడ సతీష్, ప్రస్తుత కౌన్సిలర్ బెలగాం జయ ప్రకాష్ పరామర్శించారు.
 
 గరివిడిలో...
 గరివిడి: భాగువలస గ్రామానికి చెందిన తాండ్రోతు రామప్పడు (65) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందాడు. మం గళవారం మధ్యాహ్నం కాసిన ఎండకు రామప్పడు తీవ్ర అస్వస్థతకు గురై, రాత్రి పది గంటల సమయంలో మృతి చెందారు.
 
 చీపురుపల్లిలో ఒకరు...
 చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని వంగపల్లిపేటలో బుధవారం వడదెబ్బకు గురై వీరేజు సూర్యనారాయణ(65) మృతి చెందాడు. మూడు రోజులుగా కాస్తున్న ఎండల తీవ్రతకు, ఉక్కపోతకు తాళలేక ఈయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
 మరో ఐదు
 జామి: మండలంలో బుధవారం ఐదుగురు వడదెబ్బతో మృ తి చెందారు. విజినిగిరి గ్రామానికి చెందిన శిరికి అక్కునాయుడు (65) అప్పన్నపాలెం గ్రామానికి చెందిన రంది సిమ్మ న్న (64), తెలగాపాలెం గ్రామానికి  చెందిన బోన బుచ్చిబా బు (55) ఎండల ధాటికి తాళలేక మృతి చెందారు. అలాగే శింగవరం, అలమండ  గ్రామాలకు చెందిన కోట సన్యాస మ్మ  (50) శింగవరం  గ్రామానికి  చెందిన   సవితిని  త్రినా థ్  (48) కూడా వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆయా గ్రామాల వీఆర్‌ఓలు మృతుల వివరాలు నమోదు చేశారు.
 
 కొత్తవలసలో ఒకరు..
 కొత్తవలస: కొత్తవలస-సబ్బవరం రోడ్డులో ఉంటున్న  ఓ వృద్ధుడు తీగెల వెంకట త్రినాథఅప్పలరాజు (80) వడదెబ్బతో మృతి చెందాడు. ఈయన రెండు రోజుల ఎండలు, ఉక్కపోతకు అస్వస్థతకు గురయ్యూడు. బుధవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కాగా వృద్ధుని కళ్లు దానం చేయడానికి ఆయన కుటుంబసభ్యులు ముందుకు రావడం తో విశాఖ మోహిషిన్ ఐ భ్యాంకు సిబ్బంది వచ్చి రెండు కార్నియాలు సేకరించారు.
 
 బలిజిపేటలో చిన్నారి...
 బలిజిపేట: మిర్తివలస గ్రామానికి చెందిన చిన్నారి ఎస్. ధనలక్ష్మి (7) వడదెబ్బతో మృతి చెందారు. గ్రామానికి చెందిన ఎస్ అప్పా రావు, జానకమ్మలకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ధనలక్ష్మి రెండు రోజులుగా ఎండతో ఆటుకోవడంతో వడదెబ్బకు గురైంది. దీంతో బుధవారం అస్వస్థతకు గురై మృతి చెందింది.
 

Advertisement
Advertisement