కరోనా పరీక్షల్లో ఏపీ సర్కార్‌ మరో రికార్డ్‌ | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షల్లో ఏపీ సర్కార్‌ మరో రికార్డ్‌

Published Thu, Jun 11 2020 12:55 PM

135 New Corona Virus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించటంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు 5 లక్షల 10వేల 318 మందికి కరోనా పరీక్షలు చేసింది. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో‌ నిలిచింది. మిలియన్‌ జనాభాకు 9,557 మందికి కరోనా పరీక్షలు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య 54.67 శాతానికి పెరిగింది. ( వ్యాక్సిన్‌ తయారీకి మరో 8 నెలలు)

కొత్తగా మరో 135 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 135 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,602 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 135 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు గురువారం వైద్యఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 65 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తూర్పు గోదావరి, కృష్ణ జిల్లాలలో ఒక్కోరి చొప్పున మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4261 కేసులు నమోదు కాగా, 2540 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 1641 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మొత్తం 80 మంది మరణించారు.

Advertisement
Advertisement