166వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

166వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Fri, May 18 2018 9:37 PM

166Th Day PrajaSankalpaYatra Schedule Released - Sakshi

సాక్షి, గోపాలపురం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 166వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌  గోపాలపురం నియోజకవర్గం నల్లజెర్ల  నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రకాసరావు పాలెం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యునివర్సిటీ, తెలికిచర్ల క్రాస్‌ నుంచి వెంకటరామన్న గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : జననేత వైఎస్‌ జగన్‌ పాదయ్రాత 165వరోజు ముగిసింది. శుక్రవారం రాజుపాలెం, మరంపల్లి, ఘంటావారి గూడెం, దుబచర్ల, పుల్లలపాడు మీదుగా నల్లజెర్ల వరకూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగింది. నేడు 14.9 కిలోమీటర్లు నడిచిన మొత్తం 2,067 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.

Advertisement
Advertisement