2 రోజులు..రూ. 5 కోట్లు | Sakshi
Sakshi News home page

2 రోజులు..రూ. 5 కోట్లు

Published Fri, Jan 3 2014 4:04 AM

2 days .. Rupes. 5 crore

కామారెడ్డి, న్యూస్‌లైన్:  కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేం   దుకు డిసెంబర్ 31న యువకులు పెద్ద ఎత్తున విందులు చేసుకున్నారు. మంగళవారం అర్ధరా త్రి వరకు తాగి, తూగారు. అర్ధరాత్రి దాటాక కొ  త్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే కేరింత   లు కొడుతూ ఎంజాయ్ చేశారు. జనవరి 1 బుధవారం కూడా పెద్ద ఎత్తున విందులు, వినోదాలు కొనసాగాయి. నిజామాబాద్, కామారె  డ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగాయి.
 
 దుకాణాల వద్ద వందలా ది మంది బారులు తీరారు. రెండు రోజులకు కలిపి దాదాపు రూ.ఐదు కోట్ల విలువైన మ   ద్యం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం దుకాణాల యజమానులు ముందస్తుగానే మద్యం పెద్ద ఎత్తున తె ప్పించి పెట్టారు. మాంసం అమ్మకాలూ పెద్ద ఎ త్తున సాగాయి. ముఖ్యంగా కోడి మాంసం అమ్మకాలు ఎక్కువగా సాగినట్టు తెలుస్తోంది.
 
 పండుగలను మరిపించిన వేడుకలు
 సాధారణంగా పండుగల సమయంలో అన్ని వర్గాల ప్రజలు విందులు చేసుకుంటారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా మాం    సాహారం తినే ప్రతీ ఇంటిలో మాంసం వండుకుంటారు. తాగే అలవాటు ఉన్నవారు మద్యం తెచ్చుకుని విందు చేసుకుంటారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ విందులతో ఊరట పొందుతారు. ఆ సందర్భంలో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాల వద్ద రద్దీ కనిపించే ది. ఈ సారి నూతన సంవత్సరం సందర్భంగా జనం మద్యం, మాంసం దుకాణాల వద్ద ఎగబడడం చూస్తే ఈ వేడుకలు సంప్రదాయ పండుగలను మరిపించాయనే చెప్పాలి. సంబరాలను ‘మత్తు’గా చేసుకోవడానికే ఇష్ట పడ్డారని చెప్పాలి.
 

Advertisement
Advertisement