2050 అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ | Sakshi
Sakshi News home page

2050 అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్

Published Mon, Dec 28 2015 3:53 AM

2050 to meet the needs of the Masterplan

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 54 మండలాలకు సీఆర్‌డీఏ విస్తరణ
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: మాస్టర్ ప్లాన్‌ను రాజధాని ప్రాంతం 2050 నాటి అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 25 కలిపి మొత్తం 54 మండలాల్లో సీఆర్‌డీఏ విస్తరించనుంది. రాజధాని 29 గ్రామాల్లో విస్తరించనుంది. మూడు గ్రామాల్లోని 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని పరిపాలనపరమైన (సీడ్ కేపిటల్) ప్రాంతాన్ని నిర్మించనున్నారు. సీఆర్‌డీఏ విస్తరించబోయే ప్రాంతాల్లో... కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, బాపులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, జి.కొండూరు, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, మైలవరం, నందిగామ, నందివాడ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉంగుటూరు, వత్సవాయి, వీరులపాడు, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లాలోని అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, భట్టిప్రోలు, చేబ్రోలు, దుగ్గిరాల, యడ్లపాడు, గుంటూరు, కొల్లిపర, కొల్లూరు, క్రోసూరు, మంగళగిరి, పెద్దకూరపాడు, పెద్దకాకాని, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ,  తెనాలి, చుండూరు, తుళ్లూరు, వట్టి చెరుకూరు, వేమూరు మండలాలను కలిపారు.

Advertisement
Advertisement