అత్యాచారం కేసులో 22 ఏళ్ల జైలు | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో 22 ఏళ్ల జైలు

Published Tue, May 17 2016 1:13 AM

22-year-old prison in rape case

♦ బాధితురాలినుంచి మూగ,చెవిటి నిపుణుల ద్వారా సాక్ష్యం నమోదు
♦ సాక్ష్యాన్ని వీడియో రికార్డింగ్ చేయడమూ మొదటిసారే
 
 గుంటూరు లీగల్: చెవిటి, మూగ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులకు గుంటూరు కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల వంతున జరిమానా విధించింది.ఈ సొమ్ము బాధితురాలికి వైద్య ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎం రఫీ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరు నల్లచెరువు ప్రాంతానికి చెందిన దాసరి గౌరీశంకర్, షేక్ సుభాని స్నేహితులు. మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన చెవిటి, మూగ , మానసిక వికలాంగురాలైన యువతి త ల్లితండ్రులు చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయారు.

ఆ యువతి 2014 ఫిబ్రవరి 3న కంటి పరీక్ష చేయించుకునే నిమిత్తం గుంటూరుకు వచ్చింది. ఆసుపత్రిని గుర్తించలేక నల్లచెరువు ప్రాంతం వైపు వెళ్లింది. ఆ సమయంలో నిందితులు ఆమెను మభ్యపెట్టి నల్లచెరువులోని గౌరీశంకర్ ఇంటికి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తుచేసి కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. విచారణ సమయంలో మూగ, చెవిటి నిపుణుల సాయంతో బాధితురాలు  సైగల ద్వారా చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు రికార్డుచేసింది. దీన్ని వీడియో చిత్రీకరణ కూడా చేశారు. కేసులో ఇలా సాక్ష్యాన్ని వీడియో రికార్డింగ్ చేయడం జిల్లాలో ఇదే ప్రథమం.

విచారణ అనంతరం ప్రాసిక్యూషన్ నిందితులపై నేరం రుజువు చేయడంతో 22 సంవత్సరాల జైలుశిక్ష, రూ. 5వేల వంతున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అంతేకాకుండా బాధితుల నష్టపరిహార  చట్టం ద్వారా బాధితురాలు పరిహా రం పొందేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం కూడా బాధితురాలికి తగి న నష్టపరిహారం చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఫీ తీర్పులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ ప్రాసిక్యూషన్ నిర్వహించగా, లాలాపేట సీఐ కె.వినయకుమార్ కేసు దర్యాప్తు చేశారు.

Advertisement
Advertisement