26 నుంచి ప్రయోగాత్మక విభజన | Sakshi
Sakshi News home page

26 నుంచి ప్రయోగాత్మక విభజన

Published Sat, May 3 2014 2:04 AM

26 from the Division of Experimental

జూన్ 2కు ముందే రెండు రాష్ట్రాలకు వేర్వేరు పాలన  మే 25కల్లా పంపిణీలు పూర్తి
 
 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ జూన్ 2వ తేదీ కన్నా వారం రోజుల ముందుగానే ఈ నెల 26వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ నెల 25వ తేదీలోగా విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు అన్నిరకాల పంపిణీలు పూర్తి చేయనున్నా రు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు ఎంత మంది పెన్షనర్లనే సంఖ్యను ఆర్థికశాఖ తేల్చేసింది. అలాగే విభజ నలో కీలకమైన ఫైళ్ల విభజన పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ఫైళ్లను ముమ్మరంగా స్కాన్ చేస్తున్నారు. జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా రాష్ట్రం రెండుగా విడిపోయి పనిచేయాల్సి ఉంది. అయితే జూన్ 2నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సాఫీగా పాలన కొనసాగేందుకు వీలుగా మే 26వ తేదీ నుంచే రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాల చేత ప్రయోగాత్మకంగా ముందస్తు అనుభవం కోసం వేర్వేరుగా పనిచేయించాలని నిర్ణయించారు.

ఈ వారం రోజుల్లో తలెత్తే సమస్యలను, ఇబ్బందులను అధిగమించి జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా రెండు రాష్ట్రాలు విడిపోయి పనిచేయనున్నాయి. ఆర్థికశాఖ ఏ రాష్ట్రానికి ఎంత మంది పెన్షనర్లో లెక్కలు తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు 3.40 లక్షల మంది పెన్షనర్లుగా, తెలంగాణకు 2.39లక్షల మంది పెన్షనర్లగా, ఇందులో ఒక్క హైదరాబాద్‌లో 92 వేల మంది పెన్షనర్లగా లెక్కలు కట్టారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు నెలకు రూ. 706 కోట్లు, తెలంగాణ పెన్షనర్లకు నెలకు రూ. 506 కో ట్లు చెల్లించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన కరెంట్, డిస్పోజల్‌కు చెందిన 36లక్షల ఫైళ్ల విభజననూ పూర్తి చేశారు. అలాగే కరెంట్, డిస్పోజల్‌కు చెందిన 16.32 కోట్ల పేజీల వి భజనను పూర్తి చేశారు. ఇక రాష్ట్రంలో చరాస్థుల సంఖ్య 3,42,986 గా లెక్క తేల్చారు. ఇందులో కుర్చీలు, ఫర్నిచర్, టేబుళ్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, పెన్నులు, సూదులు తదిరం ఉ న్నాయి. వీటిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌లో 22,557 ప్రభుత్వ వాహనాలు ఉన్నట్లు లెక్క తేల్చారు. వీటిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో స్థిరాస్తులు అంటే భవనాలు వంటివి 55 వేలుగా లెక్క తేల్చారు.
 
 

Advertisement
Advertisement