జిల్లాలో 3156 పోలింగ్ కేంద్రాలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో 3156 పోలింగ్ కేంద్రాలు

Published Mon, Mar 3 2014 3:18 AM

3156 polling stations in the district

చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి ప్రచురించిన ఫొటో ఓటర్ల జాబితా ఆధారంగా జిల్లాలో 3,156 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 269 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో అత్యల్పంగా 190 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
 
నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వివరాలు

 తంబళ్లపల్లె (నియోజకవర్గ సంఖ్య 281): ములకలచెరువులో 34, తంబళ్లపల్లెలో 35, పెద్దమండ్యంలో 30, పీటీఎంలో 41, బి.కొత్తకోటలో 43, కురబలకోటలో 30 మొత్తంగా 213.
 
 పీలేరు (282): గుర్రంకొండలో 36, కలకడలో 28, కేవీపల్లెలో 36, వాల్మీకిపురంలో 40, కలికిరిలో 38, పీలేరులో 52 మొత్తంగా 230.
 
 మదనపల్లె (283): మదనపల్లెలో 163, నిమ్మనపల్లెలో 22, రామసముద్రంలో 36 మొత్తంగా 221.
 
 పుంగనూరు (284): పుంగనూరులో 70, చౌడేపల్లెలో 31, సోమలలో 34, సదుంలో 26, రొంపిచెర్లలో 22, పులిచెర్లలో 32 మొత్తంగా 215.
 
 చంద్రగిరి(285): ఎర్రావారిపాళెంలో 22, చిన్నగొట్టిగల్లులో 20, పాకాలలో 48, చంద్రగిరిలో 47, తిరుపతి రూరల్‌లో 86, తిరుపతి అర్బన్ పార్ట్‌లో 15, రామచంద్రాపురంలో 31 మొత్తంగా 269.
 
 తిరుపతి (286) : తిరుపతి అర్బన్‌లో 247.
 
 శ్రీకాళహస్తి (287): శ్రీకాళహస్తిలో 121, రేణిగుంటలో 58, ఏర్పేడులో 44, తొట్టంబేడులో 35 మొత్తంగా 258.
 
 సత్యవేడు (288) (ఎస్సీ): బీఎన్‌కండ్రిగలో 32, వరదయ్యపాళెంలో 38, కేవీబీపురంలో 42, నారాయణవనంలో 31, పిచ్చాటూరులో 26, నాగలాపురంలో 26, సత్యవేడులో 44 మొత్తంగా 239.
 
 నగరి (289): వడమాలపేటలో 26, పుత్తూరులో 58, నగరిలో 73, నిండ్రలో 24, విజయపురంలో 26 మొత్తంగా 207.
 
 గంగాధరనెల్లూరు(290) (ఎస్సీ): పెనుమూరులో 35, వెదురుకుప్పంలో 36, కార్వేటినగరంలో 40, ఎస్‌ఆర్‌పురంలో 29, జీడీనెల్లూరులో 52, పాలసముద్రంలో 18 మొత్తంగా 210.
 
 చిత్తూరు (291): చిత్తూరులో 153, గుడిపాలలో 37 మొత్తంగా 190.
 
 పూతలపట్టు (292) (ఎస్సీ): ఐరాలలో 38, పూతలపట్టులో 40, తవణంపల్లెలో 44, బంగారుపాళెంలో 57, యాదమరిలో 40 మొత్తంగా 219.
 
 పలమనేరు (293): పెద్దపంజాణిలో 41, గంగవరంలో 37, బెరైడ్డిపల్లెలో 38, వి.కోటలో 54, పలమనేరులో 58 మొత్తంగా 228.
 
 కుప్పం (294): శాంతిపురంలో 43, రామకుప్పంలో 43, గుడుపల్లెలో 36, కుప్పంలో 88 మొత్తంగా 210.
 

Advertisement
Advertisement