పుష్కరాలకు 4 మీడియా సెంటర్లు | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు 4 మీడియా సెంటర్లు

Published Tue, Jul 7 2015 1:04 AM

4 Media Centers in godavari pushkaralu

కోటగుమ్మం (రాజమండ్రి) :గోదావరి పుష్కరాల కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో 4 మీడియా సెంటర్లు (రాజమండ్రిలో 2, కొవ్వూరు, నరసాపురాల్లో ఒక్కొక్కటి) ఏర్పాటు చేస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు పి.శ్రీనివాసరావు చెప్పారు. ఆనం కళా కేంద్రంలోని మీడియా సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ 2003 పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆనం కళా కేంద్రంలోని మీడియా సెంటర్‌లో 20 కంప్యూటర్లు ఏర్పాటు చేసి వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా వారు ఫీడ్ పంపుకొనేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలి పారు. తమ శాఖ తరఫున రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరుల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
 పుష్కరాల సమాచారాన్ని ప్రజలకు తెలియచేయడానికి 10 నుంచి 15 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల్లో పుష్కర సమాచారంతో పాటు బుక్‌లెట్లు, స్నాన ఘట్టాల రూట్లు, ప్రధాన దేవాలయాల సమాచారం అందుబాటులో ఉంటాయన్నారు. పుష్కర ఘాట్ నుంచి 20 కిలో మీటర్ల పొడవున పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకులు) ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాల ముఖ్య సంఘటనలను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలకు చేరవేసేలా రాజమండ్రిలో 14, కొవ్వూరులో 4, నరసాపురంలో 4 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రైనీ సబ్ కలెక్టర్ ఎండీ ముషరఫ్ ఆలీ ఫరూక్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు స్వర్ణలత, కె.రాజబాబు, ఇన్‌చార్జి సీఈ నాగరాజా, ఉప సంచాలకులు కిరణ్‌కుమార్, జిల్లా పౌర సంబంధాధికారి ఎం.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement