జిల్లాలో 4281 మందికి క్షయ | Sakshi
Sakshi News home page

జిల్లాలో 4281 మందికి క్షయ

Published Wed, Nov 6 2013 2:49 AM

4281 people suffering with tuberculosis in the district

అరకులోయ, న్యూస్‌లైన్: జిల్లాలో 4281 మం ది క్షయ వ్యాధితో చికిత్స పొందుతున్నారని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి(డీటీసీవో) డాక్టర్ వసుంధరాదేవి తెలిపారు. అరకులోయ క్లస్టర్ పరిధిలోని అరకులోయ, అనంతగిరి, మాడగడ, సుంకరమెట్ట పీహెచ్‌సీలను మంగళవారం ఆమె సందర్శించారు. క్షయ వ్యాధి కేసులపై ఆరా తీశారు. అరకులోయ కొండవీధి, పానిరంగిని గ్రామాలకు వెళ్లి టీబీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మాడగడ  పీహెచ్‌సీలో ఆశ వర్కర్లతో సమావేశమై టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. టీబీ లక్షణాలు, ఎలా సోకుతుందో వివరిం చారు.
 
  అనంతరం అరకులోయ ఏరియా ఆస్పత్రిలోని టీబీ కంట్రోల్ యూనిట్ ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రతి లక్ష మంది జనాభాలో 203 టీబీ కేసులు నమోదవుతాయని చెప్పారు. వ్యాధిగ్రస్తులకు ఉచితం గా పూర్తి వైద్య సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించి ఎటువంటి మందుల కొరత లేదన్నారు. క్షయ వ్యాధి నివారణ కోసం జిల్లాలో 59 డీఎంసీ సెంటర్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారులు శ్రీను, సాయిరాం, అరకులోయ క్లస్టర్ టీబీ యూనిట్ సూపర్వైజర్లు జగన్, వాసు పాల్గొన్నారు.  
 
 టీబీపై గిరిజనుకు అవగాహన కల్పించాలి
 అనంతగిరి రూరల్: జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వసుంధ రాదేవి మంగళవారం స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. క్షయ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సకాలంలో వైద్య సేవలందించాలని స్థానిక వైద్యాధికారి మారుతి రావు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో 90 శాతం టీబీ వ్యాధి తగ్గుముఖం పట్టిందని చె ప్పారు. టీబీపై గిరిజనులకు సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. సిబ్బంది మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించి ఈ వ్యాధిపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని కోరారు.

Advertisement
Advertisement