ఏపీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్? | Sakshi
Sakshi News home page

ఏపీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్?

Published Mon, Feb 9 2015 6:26 PM

ఏపీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించే అవకాశముంది. పెంచిన ఫిట్మెంట్  2014 జనవరి నుంచి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతుండగా, జూన్ 8 నుంచి అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వమున్నట్టు సమాచారం. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 5550 కోట్ల రూపాయల భారంపడనుంది.  

సోమవారం పీఆర్సీ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సమావేశమైంది. వీరితో చర్చించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడతో భేటీ అయింది. ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచే విషయంపై చంద్రబాబు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ఉద్యోగులు తమకు కూడా ఈ మేరకు పెంచాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement