58 మండలాల్లో కరువు! | Sakshi
Sakshi News home page

58 మండలాల్లో కరువు!

Published Sat, Oct 11 2014 3:06 AM

58 drought zones!

చిత్తూరు (సెంట్రల్): కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 58 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకున్నాయని, వీటిని కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు, ప్రజలకు సహకారం అందించాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించారు. కరువు మండలాల వివరాలు ఇలా ఉన్నాయి..

పీటీఎం, ములకలచెరువు, బి.కొత్తకోట, కలకడ, పెద్దపంజాణి, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, రామకుప్పం, పులిచెర్ల, గుడుపల్లె, నిమ్మనపల్లె, పూతలపట్టు, కుప్పం, వి.కోట, బెరైడ్డిపల్లె, సదుం, శాంతిపురం, పలమనేరు, గంగవరం, కురబలకోట, గుర్రంకొండ, మదనపల్లె, యాదమరి, వాల్మీకిపురం, గుడిపాల, జీడీనెల్లూరు, ఐరాల, తవణంపల్లె, కలికిరి, రొంపిచెర్ల, బంగారుపాళెం, చిన్నగొట్టిగల్లు, చిత్తూరు, సత్యవేడు, ఏర్పేడు, ఎస్‌ఆర్‌పురం, తొట్టంబేడు, పాకాల, రామసముద్రం, పుంగనూరు, పుత్తూరు, చౌడేపల్లె, పిచ్చాటూరు, సోమల, నారాయణవనం, నగరి, పెనుమూరు, శ్రీకాళహస్తి, నిండ్ర, కార్వేటినగరం, చంద్రగిరి, పాలసముద్రం, వెదురుకుప్పం, కేవీబీపురం, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, పీలేరు, కేవీపల్లె మండలాలున్నాయి.

వీటిన్నింటిలోనూ సాధారణ వర్షపాతం కన్నా 10 నుంచి 50 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందని వీటిన్నింటినీ కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని అధికారులు శుక్రవారం రెండు విడతలుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement