800 మంది పోలీసులతో బందోబస్తు | Sakshi
Sakshi News home page

800 మంది పోలీసులతో బందోబస్తు

Published Fri, Jan 24 2014 1:58 AM

800 people, police, security

 మక్కువ, న్యూస్‌లైన్: శంబర జాతరకు బందోబస్తుగా ఇద్దరు డీఎస్పీలు, 11మంది సీఐలు, 31మంది ఎస్సైలతో పాటు 756 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. గురువారం ఆయన శంబర గ్రామంలో జరుతున్న జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద వీవీఐపీ, వీఐపీలు అమ్మవారిని దర్శించుకునే క్యూలను, సిరిమాను తిరిగే వీధులను పరిశీ లించారు. అలాగే సిరిమాను రూట్ మ్యాప్‌ను సీఐ దేముళ్లు ఎస్పీకి వివరించారు. ప్రధానాలయం  వద్దకు జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్యేల వాహనాలను ఒక్కటి మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.
 
 అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..గ్రామంలో ఆరుచోట్ల పార్కిగ్ స్థలాలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. జాతర ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదన్నారు. దొంగనోట్ల చలామణి వ్యవ హా రం తగ్గి, గతంలో కంటే క్రైమ్‌రేట్ బాగా తగ్గిందన్నారు. సమావేశంలో ఓఎస్‌డీ ప్రవీణ్, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజేశ్‌కుమార్ గుడ్డూ,  సాలూరు సీఐ దేముళ్లు,ఎస్‌ఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement