సమైక్య ఉద్యమం @ 97 | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమం @ 97

Published Tue, Nov 5 2013 2:42 AM

97th day for united andhra pradesh movement

 సాక్షి, అనంతపురం : జిల్లాలో ‘సమైక్య’ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం 97వ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్‌లో రాజకీయ జేఏసీ ఆధ్వర్యాన సరస్వతి శిశుమందిరం విద్యార్థులు రాస్తారోకో చేశారు. తాడిపత్రి పోలీసుస్టేషన్ సర్కిల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి. అనంతపురంలోని ఎన్‌జీఓ హోంలో సమైక్యాంధ్ర పరిరక్షణపై సమావేశం నిర్వహించారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యుత్ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై ఫ్యాన్లు అమ్ముతూ నిరసన తెలిపారు. హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్‌లో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రోడ్డుపై పడుకుని రాస్తారోకో చేపట్టారు.

Advertisement
Advertisement