Sakshi News home page

ఐదు గంటలు నరకయాతన

Published Fri, Oct 18 2013 12:08 AM

a man suffered five hours

 నర్సాపూర్, న్యూస్‌లైన్:
 కోళ్ళ దాణా మిల్లులోని ఫీడ్ ఎలివేటర్‌లో చెయ్యి ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి సుమారు ఐదుగంటలపాటు నరకయాతన పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కాగజ్‌మద్దూర్‌లోని అర్చనపల్లి కోళ్ళఫాంలో నత్నాయిపల్లికి చెందిన శ్రీనివాస్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం తన విధుల్లో భాగం గా కోళ్ళఫాంలోని దాణా మిల్లులో పను లు చేస్తుండగా మిల్లులోని ఫీడ్ ఎలివేటర్‌లో ముడిదాణా జాం అయ్యింది. కాగా శ్రీనివాస్ ఎలివేటర్‌లో ఉన్న ముడిదాణాను తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒకరు మిషిన్‌ను ఆన్ చేయడంతో అతడి చెయ్యి ఫీడ్ ఎలివేటర్‌లో ఇరుక్కుంది. దీంతో ఫీడ్ ఎలివేటర్‌తోపాటు ఇతర యంత్రాలు నిలిపేసి అతని చెయ్యి బయటకు తీసేందకు ప్రయత్నించగా రాలేదు.
 
  108అంబులెన్స్ సిబ్బంది వ చ్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయిం ది. దీంతో వె ల్డింగ్ మిషన్, ఎలక్ట్రిక్ కట్ట ర్ యంత్రాలు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఫీడ్ ఎలివేటర్ పైపును కోసి కార్మికుడి చెయ్యిని బయటకు తీశారు. అతడికి గాయాలయ్యాయి. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. ఇదంతా జరిగేసరికి సుమారు ఐదు గంటలు పట్టింది. ఈ సమయంలో బాధితుడి బాధ వర్ణనాతీతం. అయితే సూపర్‌వైజ ర్ వాసు మెషిన్‌ను ఆన్ చేశాడని కార్మికు లు ఆరోపిస్తున్నారు.
 
 సూపర్‌వైజర్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ నిరక్ష్యంగా ఉండి కార్మికుడు ఎలివేటర్ వద్ద పని చేస్తున్నా పట్టించుకోకుండా ఆన్ చేయడంతో ప్రమాదం జరి గిందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్‌కు చికిత్స ఖర్చులు భరిస్తానని కోళ్ళఫాం యజమాని కొండల్‌రావు చెప్పారు. విషయం తెలుసుకొని ఎస్‌ఐ పాలవెల్లి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందలేదని చెప్పారు

Advertisement
Advertisement