మర్రి చెన్నారెడ్డికి ఘన నివాళి

3 Dec, 2013 06:00 IST|Sakshi

 అనంతగిరి, న్యూస్‌లైన్:

 మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్దంతిని పురస్కరించుకుని సోమవారం పలువురు నాయకులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. వికారాబాద్ బస్‌డిపో ఎదుట ఉన్న చెన్నారెడ్డి విగ్రహానికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాహిద్‌మియా, మార్కెట్ కమిటీ చైర్మన్లు శశాంక్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సంగమేశ్వర్, సేవాదళ్ అద్యక్షుడు చంద్రశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు, టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవన్‌నాయక్,  రాష్ట్ర కో ఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, జిల్లా అధికార ప్రతినిధి రత్నారెడ్డి  పాల్గొన్నారు.

 

 నివాళులు అర్పించిన చెన్నారెడ్డి మనుమడు

 మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి పురూరవరెడ్డి చెన్నారెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్‌ఏపీ కళాశాలలోని విగ్రహానికి కళాశాల తరపున పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

 

 వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...

 వికారాబాద్ వాకర్స్ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి తస్వర్ అలీ, జాయింట్ సెక్రటరీ మో ముల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

 

 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు