Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Published Wed, Nov 1 2017 11:42 AM

Activists, Lakshmi Parvathi take a dig at govt - Sakshi

ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు.  మహిళాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా  వైఎస్సా ర్‌ సీపీ నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో  మంగళవా రం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి  మాట్లాడుతూ ప్రశాంత విశాఖ నగరాన్ని చంద్రబాబు  ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని  విమర్శించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖానికి మేకప్‌ లేకుండా  బయటకురాడని, ఆయనకు సామాన్యుడి గోడు పట్టదన్నారు. పర్యాటక రంగం పేరుతో విశాఖలో ఫ్యాషన్‌షోలు, బికినీ డ్యాన్స్‌ల వంటివి ప్రొత్సహించడం ఎంతవరకు న్యాయమని ప్ర శ్నించారు.  

అందాలు పోటీలు నిరసించి నందుకు  మహిళా సంఘాల నాయకులను రోడ్డుపై పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి వారిపై కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు.  చంద్రబాబు వీధి వీధికి ఒక వైన్‌ షాపు, బెల్ట్‌షాపులను ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. విశాఖలో ఒక మహిళాపై నడిరోడ్డుపై లైంగికదాడి జరుగుతుంటే పోలీసులు నిరోధించలేకపోయారన్నారు.  భూకబ్జాలు, హత్యా రాజకీయాలు,మహిళలపై దాడులకు విశాఖ నిలయంగా మారిం దని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు ఇప్పటకీ నేరవేర్చలేదన్నారు. మహిళలకు ఎక్కడ  అన్యాయం జరిగినా  వైఎస్సార్‌ సీపీ మహిళలు అండగా నిలిచి పోరాడతామని చెప్పారు.  పోలీస్‌ అధికారులే హత్యలు చేయించినఘటనలు కూడా ఇక్కడే చూశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత  జర్నలిస్టులు మీద కూడా దాడులు పెరిగాయన్నారు.  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం తప్పదన్నారు. 

నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి మాట్లాడుతూ నగరంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆవేదనవ్యక్తంచేశారు. టీడీపీ పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని,  విశాఖలో ఫ్యాషన్‌షోల పేరుతో మహిళలను అర్ధనగ్న దుస్తులతో ర్యాంప్‌లపై నడిపించడం బాధాకరమన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణరెడ్డి, చంద్రమౌళి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్‌గాంధీ, నగర  బీసీ సం ఘం అధ్యక్షుడు కె.ఆర్‌.పాత్రుడు, నగర అధికార ప్రతినిధి పీతల మూర్తియాదవ్, వార్డు అధ్యక్షులు బత్తిన నాగా రాజు, పీతల వాసు, సూరాడా తాతారావు, మొల్లి అప్పారావు, గొలగాని శ్రీను, మహిళా విభాగం కార్యదర్శులు పీలా వెంకటలక్ష్మి, శ్రీదేవి వర్మ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శులు మధులత, కళావతి, కృపా, రోజారాణి, శశికళ, దమయంతి, శాంతి, ఊర్వశి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కల్పన, జిల్లా జనరల్‌ సెక్రటరీ పద్మ, జాయింట్‌ సెక్రటరీ జాన్సీ,  నగర మైనార్టీ విభాగం నాయకురాలు షబీర్‌ బేగం, సాం స్కృతిక విభాగం కన్వీనర్‌ రాధ, వివిధ వార్డుల మహిళా అధ్యక్షులు చిన్నమ్మలు, బొట్టా స్వర్ణ, యువశ్రీ, పద్మవతి, గొలగాని లక్ష్మి, గాలి పార్వతి, రమాదేవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement