‘అగ్రిగోల్డ్’ బాధితుల ఆందోళన | Sakshi
Sakshi News home page

‘అగ్రిగోల్డ్’ బాధితుల ఆందోళన

Published Sun, Jun 14 2015 2:39 AM

‘అగ్రిగోల్డ్’ బాధితుల ఆందోళన - Sakshi

రాజంపేట రూరల్ : తమ బాండ్లకు సంబంధించి నగదు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అగ్రిగోల్డ్ బాధిత ఐక్య సాధన సమితి జిల్లా కార్యదర్శి వి.ప్రసాద్, రాజంపేట అధ్యక్షుడు పీవీ సుబ్బారావు అన్నారు. రాజంపేట బైపాస్ రోడ్డులోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. యజమాన్యానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాజంపేటలో 2011లో అగ్రిగోల్డ్ సంస్థ ప్రత్యేక బ్రాంచి ఏర్పాటు చేసిందన్నారు.

ఈ బ్రాంచిలో సుమారు 2 వేల మందికి పైగా ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. 50 వేల మందికి పై గా వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ బ్రాంచ్‌లో వారు రూ. 55 కోట్లకు పైగా డిపాజిట్లు చేశారన్నారు. కాల పరిమితి ముగిసిన బాండ్లకు నగదు ఇమ్మని అడిగితే సీబీఐ విచారణ పేరు తో కాలయాపన చేస్తోందన్నారు. బాధితులకు బీజేపీ నేత నాగోతు రమేష్‌నాయుడు మద్దతు పలికారు. ర్యాలీలో పా ల్గొన్న ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలన్నారు.

అగ్రిగోల్డ్ సంస్థ నుంచి రావాల్సిన మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు ఐక్యసాధన సమితి స భ్యులు కృష్ణయ్య, ఆర్.సుబ్బయ్య, పి. రాము, డి.లక్ష్మీవరప్రసాద్, ఎం.పెంచలయ్య, మురళీ, నవనీతమ్మ, గోవిందరా జు, రెడ్డమ్మ, వారధి, ఎ.పెంచలరావు, ఏ బీవీపీ జిల్లా నేత గుణవర్మ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement