అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ | Sakshi
Sakshi News home page

అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ

Published Mon, Mar 10 2014 4:16 AM

All locations YSRCP party  competition

హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రెండు ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు.
 
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేయనున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకునేందుకు కృషి చేస్తుందన్నారు. ైవె ఎస్సార్ పథకాలు, వైఎస్సార్ ఫొటోతో గెలుపొందిన మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలను కాల్చివేయించిన విషయాన్ని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను హింసించిన విషయాలను ప్రజలు మరిచిపోలే దన్నారు. సమావేశంలో ఆ  పార్టీ హుజూర్‌నగర్ పట్టణ, మండల అధ్యక్షులు అయిలవెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లాస్టీరింగ్ కమిటీసభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్,పెదప్రోలు సైదులుగౌడ్, పీఏసీఎస్ డెరైక్టర్ జడరామకృష్ణ పాల్గొన్నారు.
 
 వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక
 స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మేళ్లచెరువు, గరిడేపల్లి మండలం వెలిదండకు చెందిన వివిద పార్టీల నాయకులు వేర్వేరుగా ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
 
 పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకోలన్నారు.  కార్యక్రమంలో మేళ్లచెరువు, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు చిలకల శ్రీనివాసరెడ్డి, బొల్లగాని సైదులుగౌడ్, నాయకులు నర్సింహారావు, వెంకన్నస్వామి, మల్లయ్య, కోటయ్య, అన్నెపంగు రామయ్య, రామకృష్ణారెడ్డి, పెండెం ముత్యాలుగౌడ్, గుండు రామాంజిగౌడ్, కర్నాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement