ఆన్‌లైన్‌లో విద్యార్థులందరి వివరాలు | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో విద్యార్థులందరి వివరాలు

Published Mon, Sep 16 2013 4:06 AM

all students information will be available in online


 మిర్యాలగూడ, న్యూస్‌లైన్
 పాఠశాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలు ఇక ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థి వ్యక్తిగత వివరాలతో పాటు పాఠశాల వివరాలను కూడా విద్యాశాఖ సేకరిస్తుం ది. దాంతో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల అక్రమాలకు చెక్ పడనుంది. అంతేగాకుండా భవిష్యత్తులో విద్యార్థికి స్కాల ర్‌షిప్‌లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులను కూడా ఆధార్ నెంబర్ ఆధారంగానే పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తం గా 6.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో విద్యనభ్యసిస్తుం డగా, 2.50 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. జూన్ మాసం నుంచే ఆధార్ కార్డుతో పాటు 32 కాలమ్‌లలో విద్యార్థి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు జారీ చేసినా, ఇప్పటి వరకు పూర్తికాలేదు.
 
  ప్రభుత్వ పాఠశాలల నుంచి 70 శాతం విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, ప్రైవేటు పాఠశాలల నుంచి స్పందన కరువైంది. ఇప్పటి వరకు ఒక్క ప్రైవేటు పాఠశాలకు చెంది న వారు కూడా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఈనెల 18వ తేదీలోగా ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
 అక్రమాలకు చెక్
 ఆధార్ కార్డు నెంబర్‌తో పాటు 32 కాల మ్‌ల విద్యార్థి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న అక్రమాల చెక్ పడనుంది. మధ్యాహ్న భోజనం నిర్వహణ విషయంలో తక్కువ మంది విద్యార్థులున్నా ఎక్కువ మందిని చూపు తూ బి ల్లులు డ్రా చేస్తున్న పాఠశాలలు అనేకం ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉ న్న పాఠశాలల్లో విద్యార్థులు లేకున్నా ఉన్నట్లుగా నమోదు చేసి కాలక్షేపం చేసు ్తన్న ఉపాధ్యాయులూ ఉన్నారు. విద్యార్థి ఉంటున్న హాస్టల్ వివరాలు కూడా నమోదు చేయడం వలన ఇక నుంచి ఎక్కువ మందిని చూపి బిల్లులు డ్రా చేసే అవకాశం ఉండదు.
 ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..
 రాజీవ్ విద్యామిషన్ పంపిణీ చేసిన 32 కాలమ్‌ల విద్యార్థుల వివరాలతో కూడి న పత్రాన్ని నింపి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ చై ల్డ్ ఇన్ ఫో డాట్ ఏపీ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్’’ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత పాఠశాల కోడ్‌ను యూజర్ ఐడీగా, పాస్‌వర్డ్‌గా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఆధారంగా వైబ్‌సైట్‌లోకి వెళ్లి 32 కాలమ్‌లలో విద్యార్థి వివరాలను అప్‌లోడ్ చేయాలి. వైబ్‌సైట్ నుంచి బయటకు వచ్చే సమయంలో లాగ్‌అవుట్ చేయాలి.

Advertisement
Advertisement