అమాయక రైతులతో ఆటలా..?: ఆర్కే | Sakshi
Sakshi News home page

అమాయక రైతులతో ఆటలా..?: ఆర్కే

Published Tue, Feb 10 2015 3:10 AM

alla ramakrishna reddy variety protest

మంగళగిరి: ‘మీ ఆస్తులైతే ఉచితంగా రాసిస్తారా.. ఒక నెల జీతం దానం చేయండి.. అమాయక రైతులతో ఆటలా.. ఉద్యోగులూ.. స్వచ్ఛందంగా భూ సమీకరణకు ముందుకు వచ్చే రైతుల నుంచే భూములు తీసుకోండి. ఇవ్వని వారి వద్ద 9.2 అభ్యంతర పత్రాలు తీసుకోండి.’ అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాజధాని గ్రామాల్లో రెండో పంట వేయవద్దనడంపై సోమవారం భిక్షాటనతో వినూత్న నిరసన తెలుపుతూ మండల గ్రామం నిడమర్రు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు అక్కడ 9.2 పత్రాలు తీసుకోవడం లేదని గోడకు అంటించిన కరపత్రం కంటపడింది. ఇంతలో కొందరు రైతులు వచ్చి తమను 9.3 పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పడంతో ఆర్కే అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
 

Advertisement
Advertisement